‘ఎక్కడ మాట్లాడినా ఏడుపొచ్చేస్తుం‍ది’

Vijay Devarakonda Dear Comrade Team Press Meet - Sakshi

శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన డియర్ కామ్రేడ్‌ టాక్‌తో సంబంధం లేకుండా మంచి వసూళ్లను సాధించింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నతో పాటు దర్శకుడు భరత్‌ కమ్మ, నిర్మాతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా నాకు చాలా పర్సనల్‌. బాబీ క్యారెక్టర్లో నటించిన తరువాత నేను కూడా చాలా ఎమోషనల్‌ పర్సన్‌ అయ్యాను.

అందుకే మా తమ్ముడు (ఆనంద్‌ దేవరకొండ) సినిమా ఫంక్షన్‌లో కూడా ఏడ్చేశా. ఈ మధ్య ఎక్కడ మాట్లాడినా ఏడుపొస్తుంది. మా ఫ్రెండ్స్‌ కూడా అదే అంటున్నారు.  ఈ సినిమాలో చేసిన ఎమోషనల్‌ సీన్స్‌, ఆ జర్నీ కారణంగా నేను మారిపోయా. డియర్‌ కామ్రేడ్‌ అన్ని భాషల్లో మంచి వసూళ్లు సాధించటం ఆనందంగా ఉంది. డియర్‌ కామ్రేడ్‌ టీంను మిస్‌ అవుతున్నా’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top