విజయ్‌ దేవరకొండ భయపడ్డాడా?

Vijay Devarakonda Dear Comrade May Postponed To June - Sakshi

టాలీవుడ్‌ సెన్సేషన్‌ విజయ్‌ దేవరకొండ కాస్త వెనకడుగు వేసినట్టు కనిపిస్తోంది. వరుస సూపర్‌ హిట్స్‌తో దూసుకెళ్తోన్న విజయ్‌ దేవరకొండ దక్షిణాదిలో పాగ వేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం విజయ్‌ నటిస్తున్న డియర్‌ కామ్రేడ్‌ చిత్రాన్ని దక్షిణాది అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ మూవీని పోస్ట్‌పోన్‌ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రాన్ని మే31 విడుదల చేయాలని తొలుత భావించినా.. అదే రోజున సూర్య నటించిన ఎన్జీకే చిత్రం విడుదల కానుంది. సూర్యకు తెలుగు, తమిళంలో మార్కెట్‌ ఉండటం, ఇప్పటికే ఈ మూవీకి మంచి హైప్‌ క్రియేట్‌ కావడంతో డియర్‌ కామ్రేడ్‌ను వాయిదా వేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని జూన్‌ 13న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి డియర్‌ కామ్రేడ్‌.. టీజర్‌, సాంగ్‌తో మంచి బజ్‌ను క్రియేట్‌ చేసింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top