కోటీశ్వరుడి విజయ విహారం | Vidya balan with nagarjuna in Meelo Evaru Koteeswarudu | Sakshi
Sakshi News home page

కోటీశ్వరుడి విజయ విహారం

Jul 10 2014 11:22 PM | Updated on Sep 2 2017 10:06 AM

కోటీశ్వరుడి విజయ విహారం

కోటీశ్వరుడి విజయ విహారం

‘‘మీ అభిమాన హీరో ఎవరు?’’.... అని నాగార్జున అడగ్గానే... ‘ఇంకెవరూ మీరే..’ అని టకీమని చెప్పారు విద్యాబాలన్. నాగ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’

 ‘‘మీ అభిమాన హీరో ఎవరు?’’.... అని నాగార్జున అడగ్గానే... ‘ఇంకెవరూ మీరే..’ అని టకీమని చెప్పారు విద్యాబాలన్. నాగ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గేమ్ షోలో విద్యాబాలన్ అతిథిగా పాల్గొన్న విషయం ఈ షో వీక్షించినవారికి తెలిసే ఉంటుంది. తనదైన శైలిలో నాగ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తీరుకి ప్రశంసలు లభిస్తున్నాయి. అడపా దడపా సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొనడం అదనపు ఆకర్షణ అవుతోంది.

గత నెల 9న ప్రారంభమైన ఈ షో తెలుగు చానల్స్ అన్నిటిలోనూ అత్యధిక రేటింగ్ సాధించి, నంబర్ వన్ షోగా నిలిచిందని ‘మా’ టీవీ ప్రతినిధి తెలిపారు. ఆంధ్ర, తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌ను కూడా కలుపుకుని 1.22 కోట్ల మంది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారని పేర్కొన్నారు. గత వారం తెలుగు బుల్లి తెరపై ఐదు టాప్ ప్రోగ్రామ్స్‌లో మొదటి నాలుగు స్థానాల్లో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఉందని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement