హీరోయిన్ కు డెంగ్యూ, హీరోకు జరిమానా! | Vidya Balan gets dengue, neighbour Shahid Kapoor served notice | Sakshi
Sakshi News home page

హీరోయిన్ కు డెంగ్యూ, హీరోకు జరిమానా!

Sep 17 2016 8:47 AM | Updated on Oct 2 2018 4:26 PM

హీరోయిన్ కు డెంగ్యూ, హీరోకు జరిమానా! - Sakshi

హీరోయిన్ కు డెంగ్యూ, హీరోకు జరిమానా!

బాలీవుడ్ ప్రముఖ నటి విద్యాబాలన్ కు డెంగ్యూ సోకినట్లు శుక్రవారం నిర్దారణ అయింది.

ముంబై: బాలీవుడ్ ప్రముఖ నటి విద్యాబాలన్ కు డెంగ్యూ సోకినట్లు శుక్రవారం నిర్దారణ అయింది. ప్రస్తుతం జుహు తారా రోడ్డులోని సొంత ఇంటిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారు. డెంగ్యూ కలిగించే దోమల(ఎడెస్ ఏఈజిప్టీ జాతి) నిరోధానికి మార్గదర్శకాలు పాటించనందుకు విద్యాబాలన్ ఇరుగుపొరుగు వారిపై బీఎంసీ కొరడా ఝుళిపించింది.
 
విద్యాబాలన్ కు డెంగ్యూ సోకిందని తెలిసిన వెంటనే అప్రమత్తమైన బీఎంసీ.. అదే అపార్ట్ మెంట్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో నివసిస్తున్న బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, మూడో ఫ్లోర్ లో నివసిస్తున్న వారి ఇళ్లను పరిశీలించింది. షాహిద్ కపూర్ కు చెందిన స్విమ్మింగ్ పూల్ లోని నీటిని వినియోగించకపోవడం వల్ల అందులో డెంగ్యూని వ్యాప్తి చేసే దోమలు అభివృద్ధి చెందినట్లు గుర్తించింది.
 
దీంతో బీఎంసీ సెక్షన్ 382 ప్రకారం సంరక్షణ చర్యలు చేపట్టనందుకు షాహిద్ కపూర్ కు రూ.10వేల జరిమానా పడే అవకాశం ఉంది. కాగా, ఒక్క సెప్టెంబర్ మాసంలోనే ముంబైలో దాదాపు 1,500 డెంగ్యూ అనుమానిత కేసులు నమోదయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement