త్వరలో మీకో సర్‌ప్రైజ్‌ : వెంకటేష్‌ | Victory Venkatesh Intresting Facebook Post | Sakshi
Sakshi News home page

Aug 14 2018 10:54 AM | Updated on Aug 14 2018 12:35 PM

Victory Venkatesh Intresting Facebook Post - Sakshi

సీనియర్‌ హీరో వెంకటేష్‌ నటుడిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టి నేటికి 32 ఏళ్లు. వెంకటేష్‌ హీరోగా తెరకెక్కిన తొలి చిత్రం కలియుగ పాండవులు 14 ఆగస్టు 1986లో రిలీజ్‌ అయ్యింది. తొలి సినిమాతో హీరోగా ఘనవిజయాన్ని అందుకున్న వెంకీ అప్పటి నుంచి ఈ విక్టరీ హీరో అగ్రకథనాయకుల్లో ఒకడిగా కొనసాగుతున్నారు.

ఈ సందర్భంగా ఇన్నేళ్ల తన ప్రయాణానికి సహకరించిన వారికి వెంకటేష్‌ సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ‘14 ఆగస్టు 1986న కలియుగ పాండవులు సినిమా రిలీజ్‌తో నటుడిగా నేను జన్మించాను. 32 ఏళ్లుగా మీ ప్రేమానురాగాలతో నాకు సపోర్ట్‌గా నిలివటం నా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమాల్లో మీరిచ్చిన ప్రోత్సాహంతో మీకు మరింత చేరువయ్యేందుకు మరో అడుగు ముందుకు వేస్తున్నాను. త్వరలో మీకో సర్‌ప్రైజ్‌’ అంటూ తన ఫేస్‌బుక్‌ పేజ్‌లో పోస్ట్‌ చేశారు వెంకీ.

గురు తరువాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న వెంకీ ప్రస్తుతం అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో యంగ్ హీరో వరుణ్‌ తేజ్‌ దర్శకత్వంలో ఎఫ్‌ 2 (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌) సినిమాలో నటిస్తున్నారు. ఈసినిమా తరువాత కేఎస్‌ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నాగచైతన్యతో కలిసి వెంకీ మామ సినిమాలో నటించేందుకు ఓకె చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement