లీకైన ‘వెంకీ మామ’ వీడియో | Venkatesh Naga Chaitanya Venky Mama Shooting Video Viral | Sakshi
Sakshi News home page

లీకైన ‘వెంకీ మామ’ వీడియో

Feb 27 2019 1:04 PM | Updated on Feb 27 2019 2:41 PM

Venkatesh Naga Chaitanya Venky Mama Shooting Video Viral - Sakshi

పెరుగుతున్న టెక్నాలజీ అన్ని రంగాలను ఇబ్బందుల పాలు చేస్తుంది. ముఖ్యంగా సినీ రంగానికి లీకులు పైరసీ పెద్ద సమస్యగా మారాయి. స్టార్ హీరోల సినిమాలకు పదే పదే లీకుల కారణంగా తలనొప్పులు తప్పటంలేదు. తాజాగా వెంకటేష్‌, నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న వెంకీ మామ సినిమా కూడా లీకు వీరుల బారిన పడింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ రాజమండ్రిలో జరగుతుంది.

గోదావరి తీరంలో వెంకీ, చైతులపై చిత్రీకరించిన ఓ సన్నివేశానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాయల్ రాజ్‌పుత్‌, రాశీఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను కోన ఫిలిం కార్పోరేషన్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లపై బాబీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. తమన్‌ సంగీతమందిస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement