రొమాంటిక్‌ థ్రిల్లర్‌ | venkatesh goud sudigali movie august releases | Sakshi
Sakshi News home page

రొమాంటిక్‌ థ్రిల్లర్‌

Jul 3 2018 1:16 AM | Updated on Jul 3 2018 1:17 AM

venkatesh goud sudigali movie august releases - Sakshi

వెంకటేశ్, మమత

వెంకటేశ్‌ గౌడ్, మల్లేష్‌ బి. అభయ్, మమతా కులకర్ణి, ప్రాచీ అధికారి ముఖ్య పాత్రల్లో రమేష్‌ అంక రూపొందించిన చిత్రం ‘సుడిగాలి’. చెట్టుపల్లి లక్ష్మీ సమర్పణలో శివ పార్వతి క్రియేషన్‌ పతాకంపై చెట్టుపల్లి వెంకటేశ్, బిరాదర్‌ మల్లేష్‌ నిర్మించారు. ఈ సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ అయిన సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘యాక్షన్, రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘సుడిగాలి’. ఇందులో ఐదు పాటలు, ఐదు ఫైట్లు ఉన్నాయి. ర్యాప్‌ రాక్‌ షకీల్‌ మంచి మ్యూజిక్‌ అందించారు. ఆడియోను ఈ నెలలో, సినిమాను ఆగస్ట్‌లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘నటీనటులు కొత్తవారైనా చక్కగా నటించారు. సినిమా కంప్లీట్‌ చేయడానికి నిర్మాతల సహకారం మరువలేనిది’’ అన్నారు దర్శకుడు రమేష్‌. ఈ సినిమాకు కెమెరా: విద్యాసాగర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement