సరదా సరదాగా... | vekkirintha movie set to release in january | Sakshi
Sakshi News home page

సరదా సరదాగా...

Dec 23 2016 11:32 PM | Updated on Sep 4 2017 11:26 PM

సరదా సరదాగా...

సరదా సరదాగా...

కాకర్ల శ్రీధర్, వినీత్, ప్రేయసీ నాయక్, మౌనికా రెడ్డి, మహిమ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘వెక్కిరింత’.

కాకర్ల శ్రీధర్, వినీత్, ప్రేయసీ నాయక్, మౌనికా రెడ్డి, మహిమ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘వెక్కిరింత’. జంగాల నాగబాబు దర్శకత్వంలో శ్రీ లాస్య క్రియేషన్స్‌ పతాకంపై రాహుల్‌ శ్వేత సమర్పణలో కాకర్ల నాగమణి నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. నిర్మాత మాట్లాడుతూ– ‘‘ప్రేమ, వినోదం వంటి అన్ని వాణిజ్య అంశాలున్న చిత్రమిది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులకూ నచ్చేలా ఉంటుంది. యాక్టర్స్‌ కొత్తవాళ్లైనా అనుభవం ఉన్నవారిలా నటించారు. జనవరిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

‘‘టైటిల్‌కి తగ్గట్టుగానే ఈ చిత్రం సరదా సరదాగా ఉంటుంది’’ అని దర్శకుడు అన్నారు. ‘‘ప్రేక్షకుల అభిరుచులు మారాయి. కథ బాగుంటే చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్ని సినిమాలనూ ఆదరిస్తున్నారు. ఈ చిత్రం సక్సెస్‌ అవ్వాలి’’ అని సీనియర్‌ నటి కవిత పేర్కొన్నారు. ‘‘ఈ చిత్రం కేవలం యూత్‌కే కాదు. ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా నచ్చుతుంది’’ అన్నారు ప్రముఖ దర్శకుడు సాగర్‌. చిత్రదర్శకుడు నాగబాబు, నిర్మాత సాయి వెంకట్, చిత్రబృందం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement