వేలంటైన్‌ వీక్‌లో... తొలిప్రేమ | Varun Tej's Tholiprema Release on february 9 | Sakshi
Sakshi News home page

వేలంటైన్‌ వీక్‌లో... తొలిప్రేమ

Oct 31 2017 12:44 AM | Updated on Oct 31 2017 12:44 AM

Varun Tej's Tholiprema Release on february 9

ఫిబ్రవరి... ప్రేమికులకు వెరీ స్పెషల్‌ మంత్‌! ఎందుకో స్పెషల్‌గా చెప్పాలా? ఫిబ్రవరి 14న వేలంటైన్స్‌ డే! 14కి ముందు వారం రోజులు... ఒక్కో రోజునూ ఒక్కో పేరుతో సెలబ్రేట్‌ చేస్తారు. దటీజ్‌ వేలంటైన్స్‌ వీక్‌. సో, ప్రేమికులకు వెరీ వెరీ స్పెషల్‌ వీక్‌. అప్పుడే వరుణ్‌ తేజ్‌ ‘తొలిప్రేమ’ను ప్రేక్షకులందరికీ చూపిస్తారట! వరుణ్‌ తేజ్, రాశీ ఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర సంస్థపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ‘తొలిప్రేమ’ టైటిల్‌ ఖరారు చేశారట.

వచ్చే ఏడాది వేలంటైన్స్‌ వీక్‌లో చాక్లెట్‌ డే (ఫిబ్రవరి 9)న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ– ‘‘ఇటీవల 40 రోజులు ఏకధాటిగా లండన్‌లో చేసిన షెడ్యూల్‌తో 70 శాతం సినిమా పూర్తయింది. డిసెంబర్‌కి చిత్రీకరణ పూర్తి చేసి, వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. తమన్‌ సంగీతం,  జార్జ్‌ సి. విలియమన్స్‌ ఛాయాగ్రహణం చిత్రానికి పెద్ద ఎసెట్‌గా నిలుస్తాయి’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement