రానా సినిమాలో మెగా హీరో..!

Varun Tej to star in Rana Haathi mere Saathi - Sakshi

యంగ్ హీరో రానా త్వరలో ఓ బహుభాషా చిత్రాన్ని ప్రారంభించనున్నాడు. హథీ మేరీ సాథి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన రానా.. సినిమా మీద మంచి హైప్ క్రియేట్ చేశాడు. తాజా సినిమా విశేషాలు తెలియజేసిన దర్శకుడు ప్రభు సాల్మాన్ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

ఈ సినిమాలో రానాతో పాటు మరో యంగ్ హీరో వరుణ్ తేజ్ కూడా కీలక పాత్రలో నటించనున్నట్టుగా తెలిపాడు. అది కూడా రానాతో సమానమైన ఇంపార్టెన్స్  ఉన్న రోల్ అని వెల్లడించాడు. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందించి తరువాత తమిళ్ లో డబ్ చేసి రిలీజ్ చేయనున్నట్టుగా వెల్లడించారు. రానా బందేవ్ పాత్రలో నటిస్తున్న ఈసినిమాను బాలీవుడ్ సీనియర్ నటుడు రాజేష్ ఖన్నాకు నివాళిగా తెరకెక్కిస్తున్నట్టుగా తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top