‘సీనియర్‌ ఎన్టీఆర్’.. వర్మ ఫస్ట్‌ లుక్‌ | Varma surprises Laxmis NTR first look relesed | Sakshi
Sakshi News home page

‘సీనియర్‌ ఎన్టీఆర్’.. వర్మ ఫస్ట్‌ లుక్‌

Sep 26 2017 10:11 PM | Updated on Sep 26 2017 10:26 PM

 Varma surprises Laxmis NTR first look relesed

సాక్షి, హైదరాబాద్: దివంగత నందమూరి తారక రామారావు జీవిత కథను ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’  పేరిట తెరకెక్కిస్తున్న వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసి సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఈ లుక్‌లో ఓ మహిళ చెప్పులు విడిచి గడప దాటుతూ ఇంట్లోకి వెళుతుండగా.. లోపల మరో వ్యక్తి కాషాయపు దుస్తులు ధరించి కుర్చీలో కూర్చొని ఉన్నాడు. 

ఈ లుక్‌ను గమనిస్తుంటే లోపలికి వెళ్తున్న పాత్రలో లక్ష్మీపార్వతి, లోపలున్న వ్యక్తి ఎన్టీఆర్‌ పాత్రలా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పలు వివాదాస్పద పోస్ట్ లు చేసిన రామ్ గోపాల్ వర్మ తాజా లుక్‌తో సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ చేశారు. అయితే లీడ్ రోల్స్ లో ఎవరెవరు నటిస్తున్నారన్న విషయం తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement