ప్రేమకథలో వర్షం ఏం చేసింది? | vana villu movie shooting stars | Sakshi
Sakshi News home page

ప్రేమకథలో వర్షం ఏం చేసింది?

Aug 16 2016 10:57 PM | Updated on Sep 4 2017 9:31 AM

ప్రేమకథలో వర్షం ఏం చేసింది?

ప్రేమకథలో వర్షం ఏం చేసింది?

ప్రతీక్ ప్రేమ్ కరణ్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘వానవిల్లు’. శ్రావ్య, శ్రీ సయ్యిని హీరోయిన్లు.

 ప్రతీక్ ప్రేమ్ కరణ్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘వానవిల్లు’. శ్రావ్య, శ్రీ సయ్యిని హీరోయిన్లు. రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై లంకా కరుణాకర్ దాస్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నిర్మాత మాట్లాడుతూ - ‘‘టైటిల్‌కి తగ్గట్టు ఓ అందమైన వెరైటీ ప్రేమకథ ఇది.

 అందులో వర్షం ఏం చేసింది? అనేది ఆసక్తికరం. కేరళ, మలేసియాలలో కొంత టాకీ, సాంగ్స్ షూట్ చేశాం. సెప్టెంబర్ మొదటివారంలో లాస్ట్ షెడ్యూల్ మొదలవుతుంది. ఈ నెలాఖరున టీజర్ విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ప్రభాస్ శీను, సత్య, సురేఖావాణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డైలాగ్స్: పవన్, మ్యూజిక్: ప్రభు ప్రవీణ్.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement