అమీర్‌ ఫ్యాన్స్‌ దెబ్బ, కమల్‌ ఖాన్‌ అబ్బా..

Twitter suspends Kamaal R Khan’s account for his attack on Aamir Khan’s Secret Superstar

సాక్షి: కమల్‌ ఖాన్‌ బాలీవుడ్‌లో సెలబ్రిటీ. ఎల్లప్పుడూ వివాదాల్లో ఉంటాడు. హీరోలను విమర్శించడం ఆపై అభిమానుల నుంచి చివాట్లు తినడం ఆయనకు అలవాటు. అయినా తన ప్రవర్తన ఏమాత్రం మార్చుకోరు. వివాదాలను ఇంటి చూట్టు తిప్పుకుంటా నేను ఇంతే అనే రేంజ్‌లో ఫీల్‌ అవుతారు. కానీ సెలబ్రిటీకి కూడా ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అమీర్‌ఖాన్‌ అభిమానుల దెబ్బకు ఖంగుతున్నాడు. తమ అభిమాన నటుడిపై విమర్శలు చేసినందుకు ఏకంగా కమల్‌ఖాన్‌ ట్వట్టర్‌ అకౌంట్‌నే బ్లాక్‌ చేశారు.  

వివరాల్లోకి వెళ్తే అమీర్‌ ఖాన్‌ తాజాగా నటించిన సీక్రెట్‌ సూపర్‌స్టార్‌ సినిమా క్లైమాక్స్‌ను రివీల్‌ చేస్తూ ఓ సమీక్ష రాశాడు. అయితే ఇంకా విడుదల కాకుముందే కథను సోషల్‌ మీడియాలో చెప్పడంతో అమీర్‌ఖాన్‌ అభిమానులకు కోపం వచ్చింది. దీంతో కమల్‌ ఖాన్‌ అకౌంట్‌పై  ట్వట్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కమల్‌ఖాన్‌ అకౌంట్‌ ఆగిపోయింది. గతంలో కమల్‌ బాహుబలి సినిమా, మహేష్‌ బాబు, పవన్‌కల్యాణ్‌పై కూడా విమర్శలు చేశారు.

దీనిపై కమల్‌ఖాన్‌ మీడియాకు ఓలేఖ రాశాడు. కేవలం సినిమాకు వ్యతిరేకంగా రివ్యూ రాయడం వల్లే తన ట్విట్టర్‌ ఖాతా కోల్పోయాననని తెలిపాడు. గత నాలుగేళ్లలో ఎంతో డబ్బు సినిమాలకు ఖర్చుపెట్టానని, తన ఖాతాకు 6మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారని పేర్కొన్నాడు. అంతేకాడు అమీర్‌ఖాన్‌పై విమర్శలు ఎక్కుపెట్టాడు. 'అమీర్‌ నన్ను ట్విట్టర్‌లో ఉండనీయాలనుకోవట్లేదు. ఎందుకంటే ట్విట్టర్‌కు యజమాని అమీర్‌ కాబట్టి నేను మరో కొత్త ఖాతా తెరవాలనుకోవట్లేదు అంటూ విమర్శించాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top