మా ప్రేమ అబద్ధం కాదు: నటి

Twilight Star Kristen Stewart Calls Robert Pattinson Her First Love - Sakshi

హాలీవుడ్‌లో మంచి వసూళ్లను సాధించిన ‘ట్విలైట్‌’ చిత్రంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుక్ను హీరోయిన్‌ క్రిస్టెన్‌ స్టీవార్ట్‌. ఈ హీరోయిన్‌ గతంలో పలువురు సెలబ్రిటీలతో డేటింగ్‌లో పాల్గొనగా ప్రస్తుతం స్వలింగ సంపర్కురాలిగా ముద్ర వేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ట్విలైట్‌ సినిమాల సిరీస్‌లో తనతోపాటు స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న హీరో రాబర్ట్‌ పాటిన్‌సన్‌తో ఉన్న రిలేషన్‌ను మరోసారి ఆమె బయటపెట్టింది. ట్విలైట్‌ సిరీస్‌లో తెరపై కనిపించే ప్రేమ నిజజీవితంలోనూ అలాగే ఉండేదని తెలిపింది. ఆ ప్రేమ అబద్ధం కాదని స్పష్టం చేసింది. గతంలో విచ్చలవిడిగా తిరిగిన ఈ జంట డేటింగ్‌ కూడా చేసింది. గతంలో రాబర్ట్‌తో సాగిన ప్రయాణాన్ని ఓసారి గుర్తు చేసుకుంది.

ఈ సందర్భంగా తాము చాలా సంవత్సరాలు కలిసి ఉన్నామని, అతనితో చిగురించిన ప్రేమే తనకు ఫస్ట్‌ లవ్‌ అని క్రిస్టెన్‌ చెప్పుకొచ్చింది. అతనే తన బెస్ట్‌ అని ప్రకటించింది. ఇక పాటిన్‌సన్‌ నిన్ను పెళ్లి చేసుకోమని అడిగితే ఒప్పుకుంటారా అని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు చెప్పలేమన్నట్టుగా మాట దాటవేసింది. లెస్బియన్‌గా ప్రకటించుకున్న స్టీవార్ట్‌ ప్రస్తుతం డైలన్‌ మేయర్‌ అనే సహనటితో డేటింగ్‌లో ఉంది. ఇక క్రిస్టెన్‌ స్టీవార్ట్‌, నవోమీ స్కాట్‌, ఎల్లా బాలిన్‌స్కా ప్రధాన పాత్రల్లో నటించిన చార్లెస్‌ ఏంజెల్స్‌ నవంబర్‌ 15న విడుదల కానుంది. మరోవైపు క్రిస్టెన్‌ మాజీ ప్రియుడు పాటిన్‌సన్‌ బాట్‌మన్‌ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రం 2021, జూలై 25న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top