టర్నింగ్ పాయింట్! | Turning Point | Sakshi
Sakshi News home page

టర్నింగ్ పాయింట్!

May 11 2015 10:52 PM | Updated on Sep 3 2017 1:51 AM

టర్నింగ్ పాయింట్!

టర్నింగ్ పాయింట్!

సంఘ విద్రోహ శక్తులపై మహిళా పోలీస్ ఆఫీసర్ ఎలా పోరాడిందనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘బుల్లెట్ రాణి’.

సంఘ విద్రోహ శక్తులపై మహిళా పోలీస్ ఆఫీసర్ ఎలా పోరాడిందనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘బుల్లెట్ రాణి’. నిషా కొఠారీ కథానాయికగా ఫోకస్ ఆర్ట్ పిక్చర్ పతాకంపై ఎం.ఎస్. యూసుఫ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాజిద్ ఖురేషీ దర్శకుడు. ఈ సినిమా పాటలను త్వరలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. నిషా కొఠారీకి ఈ చిత్రం టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: గున్వంత్‌సేన్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: గోవింద్ యాదవ్.
 

Advertisement
 
Advertisement
Advertisement