టీవీ ఛానల్‌ను ప్రశ్నించిన త్రిష! | Trisha Question To Sun Tv To Play 96 movie | Sakshi
Sakshi News home page

Nov 4 2018 4:14 PM | Updated on Nov 4 2018 4:14 PM

Trisha Question To Sun Tv To Play 96 movie - Sakshi

విజయ్‌ సేతుపతి, త్రిష జంటగా నటించిన ‘96’ సినిమా ఇటీవలె విడుదలైన సంగతి తెలిసిందే. తమిళ నాట ఈ మూవీ సూపర్‌హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా రీమేక్‌ చేయాలని కొందరు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. 

అయితే ఈ చిత్రం ఇప్పటికీ విజయవంతంగా థియేటర్లలో రన్‌ అవుతోంది. దీపావళి కానుకగా సన్‌ నెట్‌వర్క్‌ ఈ చిత్రాన్ని టీవీలో ప్రదర్శించబోతున్నట్లు ప్రకటించింది. దీనిపై త్రిష సోషల్‌ మీడియాలో స్పందిస్తూ.. ‘ఇప్పటికీ 80 శాతం థియేటర్లలో సినిమాను ప్రదర్శిస్తున్నారు. అలాంటప్పుడు ఇంత త్వరగా సినిమా ప్రీమియర్‌ షో వేయడం కరెక్ట్‌ కాదు. సంక్రాంతికి ప్రీమియర్‌ షో వేస్తే బాగుంటుందని నా అభిప్రాయం’ అంటూ త్రిష ట్వీట్‌ చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement