కరెంట్‌ అఫైర్స్‌పై.. సో కూల్‌ అంటోన్న త్రిష

Trisha posts Bank Examinations most important Bit - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యునిసెఫ్‌ సంస్థ బాలల హక్కుల రాయబారిగా సినీ నటి త్రిష ఇటీవలే నియమితులయిన విషయం తెలిసిందే. అయితే బ్యాంకు పరీక్షల్లో నవంబర్‌ నెలకుగానూ కరెంట్‌ అఫైర్స్‌లో ముఖ్యమైవాటిలో త్రిషకు సంబంధించిన ప్రశ్న కూడా ఉంది. ఇది చూసిన త్రిష కరెంట్‌ అఫైర్స్‌లో తన గురించి అడిగిన ప్రశ్నకు సంబంధించి ఓ పేపర్‌ని, దిస్ ఈజ్ సో కూల్‌ అంటూ తన ట్విట్టర్‌ అకౌంట్లో పోస్ట్‌ చేసింది. దక్షిణ భారత దేశ చలనచిత్ర రంగం నుంచి ఈ గౌరవం దక్కిన తొలి హీరోయిన్‌  త్రిష కావడం విశేషం.
 

కేరళ ప్రభుత్వం, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంఘమైన యునిసెఫ్‌ సంస్థ సంయుక్తంగా చిన్నారులకు మీజిల్స్‌ టీకా ఆవశ్యకతపై యాడ్‌ ఫిల్మ్‌ రూపొందించారు. ఈ సందర్భంగా యూనిసెఫ్‌ తరఫున తమిళనాడు, కేరళ చిన్నారుల హక్కుల రాయబారిగా సినీ నటి త్రిషను నియమించింది. దీని ద్వారా ఆమె బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, బాలలపై లైంగిక హింస వంటి వాటిపై వ్యతిరేకంగా పోరాడనున్నారు. బాలల విద్య కోసం కృషి చేయనున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top