మిస్‌ డిటెక్టివ్‌ | Trisha gets busy, plays a private detective in 'Kuttrappayirchi' | Sakshi
Sakshi News home page

మిస్‌ డిటెక్టివ్‌

Feb 4 2018 1:32 AM | Updated on Feb 4 2018 1:32 AM

Trisha gets busy, plays a private detective in 'Kuttrappayirchi' - Sakshi

త్రిష

చేతిలో సెల్‌ఫోన్, బ్యాగ్‌లో కాస్మొటిక్స్‌ మాత్రమే కాదు... కత్తి, పిస్టల్‌లను కూడా బ్యాగ్‌లో క్యారీ చేస్తున్నారు త్రిష. ఎందుకంటే.. ప్రైవేటు డిటెక్టివ్‌ కదా. ఆ మాత్రం సెల్ఫ్‌ కేర్‌ తీసుకోవాల్సిందేగా. త్రిష చేయబోయే సీక్రెట్‌ ఆపరేషన్‌ ఏంటి? టార్గెట్‌ ఎవరు? అంటే ప్రస్తుతానికి సస్పెన్స్‌. కొత్త దర్శకుడు వెర్నిక్యు దర్శకత్వంలో రూపొందనున్న ఉమన్‌సెంట్రిక్‌ ఫిల్మ్‌ ‘కుట్రపయర్చి’ (నేరము శిక్షణ అని అర్థం)లో లీడ్‌ రోల్‌ చేస్తున్నారు త్రిష. ‘‘స్టోరీ చెప్పినప్పుడు త్రిష చాలా ఎగై్జట్‌ అయ్యారు.

ఆమె క్యారెక్టర్‌లో మల్టీషేడ్స్‌ ఉంటాయి. సరదాగా  ఉండే తన పాత్ర సడన్‌గా స్ట్రాంగ్‌ అండ్‌ డేర్‌ డెసిషన్స్‌ తీసుకుంటుంది’’ అన్నారు వెర్నిక్యూ. అంతేకాదు ఈ సినిమాలో షార్ట్‌ హెయిర్‌తో డిఫరెంట్‌గా కనిపించనున్నారట త్రిష. దేశంలో ఫస్ట్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ ఇన్వెస్టిగేటర్‌ రజనీ పండిట్‌ని ఆదర్శంగా తీసుకుని త్రిష క్యారెక్టర్‌ను డిజైన్‌ చేశారట చిత్రబృందం. గతేడాది ఒక్క సినిమాలోనూ కనిపించని త్రిష ఈ ఏడాది మినిమమ్‌ అరడజను సినిమాల్లో కనిపించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement