ట్రాప్‌లో పడతారు | Trap movie updates | Sakshi
Sakshi News home page

ట్రాప్‌లో పడతారు

Nov 16 2019 4:48 AM | Updated on Nov 16 2019 8:32 AM

Trap movie updates - Sakshi

మహేందర్‌ ఇప్పలపల్లి హీరోగా, షాలు, కాత్యాయనీ శర్మ హీరోయిన్లుగా బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో వీఎస్‌ ఫణీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ట్రాప్‌’. ఆళ్ల స్వర్ణలత నిర్మాతగా పరిచయమవుతున్న ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా వీఎస్‌ ఫణింద్ర మాట్లాడుతూ–‘‘లవ్, క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. ఈ చిత్ర కథ చెప్పగానే నాతో సినిమా తీయడానికి ఒప్పుకున్న ఆళ్ల స్వర్ణలతగారికి థ్యాంక్స్‌.

‘సింధూరం’ సినిమా బ్రహ్మాజీగారికి ఎంత మంచి పేరు తీసుకువచ్చిందో ‘ట్రాప్‌’ చిత్రం నాకు అంత మంచిపేరు తీసుకువస్తుందని నమ్ముతున్నాను’’అన్నారు. ‘‘నిర్మాణ రంగంలోకి రావాలంటే తొలుత చాలా భయం వేసింది. కానీ, హీరో, హీరోయిన్, సాంకేతిక నిపుణులందరూ మంచి సహకారం అందించడంతో సినిమా చాలా బాగా వచ్చింది. మా చిత్రం అన్ని కార్యక్రమాలను ఫణీంద్ర దగ్గరుండి చూసుకున్నారు’’ అన్నారు ఆళ్ల స్వర్ణలత. రచ్చరవి, విట్టల్, పరమేశ్వర శర్మ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్‌ కె, శివ, సంగీతం: ఈశ్వర్‌ పెరావలి, నేపథ్య సంగీతం: హర్ష ప్రవీణ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement