దమ్మున్నోడు! | Track list of Allu Arjun-starrer 'Sarainodu' released Thursday | Sakshi
Sakshi News home page

దమ్మున్నోడు!

Apr 1 2016 11:07 PM | Updated on Sep 3 2017 9:01 PM

దమ్మున్నోడు!

దమ్మున్నోడు!

అల్లు అర్జున్ మంచి మాస్ హీరో. క్యారెక్టర్‌లో కంటెంట్ ఉంటే నటుడిగా తన దమ్ము ఏంటో చూపిస్తారు.

అల్లు అర్జున్ మంచి మాస్ హీరో. క్యారెక్టర్‌లో కంటెంట్ ఉంటే నటుడిగా తన దమ్ము ఏంటో చూపిస్తారు. ఇక.. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్ తీయడంలో తనకు తానే సాటి అయిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో అంటే.. అల్లు అర్జున్‌లో కొత్త యాంగిల్ చూడనున్నామని ఫిక్స్ అయిపోవచ్చు. గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ, రకుల్‌ప్రీత్ సింగ్, క్యాథరిన్ కథానాయికలుగా బోయపాటి దర్శకత్వం వహించిన ‘సరైనోడు’ ఈ నెల 22న విడుదల కానుంది.
 
 ఎలాంటి హంగామా లేకుండా ఈ చిత్రం పాటలను నేరుగా మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 10న విశాఖపట్నంలో అభిమానుల సమక్షంలో ప్రీ-రిలీజ్ వేడుకను అట్టహాసంగా జరపనున్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ- ‘‘ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్‌కు అనూహ్య స్పందన లభించింది.
 
 బన్నీని బోయపాటి సరికొత్తగా చూపించాడు. అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునే యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. బన్నీ, అంజలి మీద వచ్చే ప్రత్యేక గీతం హైలైట్‌గా నిలుస్తుంది. ఎస్.ఎస్. తమన్ మంచి పాటలు ఇచ్చాడు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమేరా: రిషి పంజాబీ, సహ నిర్మాత: శానం నాగ అశోక్ కుమార్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement