'ఛీ.. ప్రియాంక వంట కుక్కలు తింటాయి' | This Is What Gordon Ramsay Had To Say About Priyanka Chopra's Cooking | Sakshi
Sakshi News home page

'ఛీ.. ప్రియాంక వంట కుక్కలు తింటాయి'

May 21 2017 6:57 PM | Updated on Sep 5 2017 11:40 AM

'ఛీ.. ప్రియాంక వంట కుక్కలు తింటాయి'

'ఛీ.. ప్రియాంక వంట కుక్కలు తింటాయి'

బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసి హాలీవుడ్‌కు పరిచయమై ప్రపంచ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న ప్రియాంక చోప్రా వంటను ఓ చెఫ్‌ వెక్కిరించాడు.

లాస్‌ఏంజెల్స్‌: బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసి హాలీవుడ్‌కు పరిచయమై ప్రపంచ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న ప్రియాంక చోప్రా వంటను ఓ చెఫ్‌ వెక్కిరించాడు. అది కూడా ప్రియాంకా చేసిన వంట కుక్కలకు పెట్టేదిలా ఉందని. జోర్డన్‌ రామ్సే.. ఓ బ్రిటీష్‌ సెలబ్రెటీ చెఫ్‌. ఆయన వంటలు నలభీమ పాకంలో ఉంటాయి అంటారు చాలా మంది సెలబ్రిటీలు. రామ్సే వంట ఎంత బాగా చేస్తాడో ఇతరులు చేసే వంటకాలను అంతే ఆక్షేపిస్తూ ఉంటాడు. రామ్సే తాజాగా మన ప్రియాంక చోప్రా చేసిన వంటపై కామెంట్‌ చేశాడు.

హాలీవుడ్‌ ప్రాజెక్టుల కోసం ప్రియాంక ఏడాదిగా అమెరికాలో ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రియాంక ఓ టాక్‌ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా ప్రియాంక సరదాగా కిచిడి, చికెన్‌ సూప్‌ చేసి సదరు షోలో చూపించింది. ఆ షోలో రామ్సే కూడా ఉన్నాడు. ప్రియాంక వండింది రుచి చూసి కనీసం ఆమె కూడా ఓ సెలబ్రెటీనే అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ‘ఛీ.. ఇది కుక్కకు పెట్టే ఫుడ్‌లా ఉంది’ అనేశాడు. అంతే ఒక్కసారిగా ప్రియాంక అభిమానులు రామ్సేపై ట్వీటర్‌ అస్త్రాన్ని ప్రయోగించారు. ప్రియాంకను అంత మాట అంటావా? అంటూ తిట్టి పోశారు. అయితే, రామ్సే కామెంట్‌పై ప్రియాంక చోప్రా ఇంకా స్పందించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement