
ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం!
విమానంలో ప్రయాణించేవారు ఎలాంటి అసౌకర్యానికీ గురి కాకుండా చూసుకోవడం ఎయిర్ హోస్టెస్ బాధ్యత.
విమానంలో ప్రయాణించేవారు ఎలాంటి అసౌకర్యానికీ గురి కాకుండా చూసుకోవడం ఎయిర్ హోస్టెస్ బాధ్యత. అంతేకానీ, ప్రాణాలు సైతం ఇవ్వాలని కాదు. కానీ, ఓ సిన్సియర్ ఎయిర్ హోస్టెస్ ప్రయాణీకులను కాపాడ్డానికి తన ప్రాణాలనే వదులుకుంది. ఆమె పేరు ‘నీరజా బానోట్’. 1986లో హైజాక్‌కి గురైన విమానంలోని ప్రయాణీకులను కాపాడే క్రమంలో ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైంది నీరజా. ఆమె జీవితం ఆదర్శంగా హిందీలో ఓ చిత్రం రూపొందుతోంది.
ఇందులో నీరజా బానోట్ పాత్రను సోనమ్ కపూర్ చేస్తున్నారు. ఈ పాత్ర కోసం జుత్తు కత్తిరించుకున్నారు సోనమ్. అసలు సిసలు ఎయిర్ హోస్టెస్‌గా ఒదిగిపోవడానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నారు. నీరజా గొప్ప యువతి అనీ, తనకు అంకితంగా చేస్తున్న చిత్రం ఇదఅనీ, తనకిది ప్రత్యేకమైన సినిమా అనీ సోనమ్ కపూర్ పేర్కొన్నారు. సోమవారం ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు.