అప్పుడు క్లాస్.. ఇప్పుడు మాస్ | Then the class .. now mass | Sakshi
Sakshi News home page

అప్పుడు క్లాస్.. ఇప్పుడు మాస్

Published Fri, May 9 2014 11:30 PM | Last Updated on Tue, Nov 6 2018 4:55 PM

అప్పుడు క్లాస్.. ఇప్పుడు మాస్ - Sakshi

ఈ కుర్రాణ్ణి గుర్తుపట్టారా? శేఖర్ కమ్ముల పరిచయం చేసిన యంగ్ హీరో ఇతను. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’తో బ్యూటిఫుల్ ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రాడి పేరు అభిజిత్. ఆ సినిమాలో చాలా క్లాస్‌గా కనిపించిన అభిజిత్, తన రెండో చిత్రం  ‘మిర్చిలాంటి కుర్రాడు’ కోసం మాస్‌గా తయారయ్యాడు. ఇందులో తను సిక్స్‌ప్యాక్ దేహంతో యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా అలరించనున్నాడు. ఈ విశేషాలను అభిజిత్ వివరిస్తూ - ‘‘ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ తర్వాత సిక్స్‌ప్యాక్ కోసం కసరత్తులు మొదలుపెట్టాను.
 
 లక్కీగా అలాంటి పాత్రే నాకు లభించింది. సిక్స్ ప్యాక్ సన్నివేశాలు తీస్తున్నపుడు వారం ముందు నుంచే కొంత ప్రిపరేషన్ ఉండాలి. వాటర్ కంటెంట్ బాగా తగ్గించేయాలి. అలాగే ఉప్పు అస్సలు వాడకూడదు’’ అన్నారు. ‘మిర్చి లాంటి కుర్రాడు’ సినిమా గురించి మాట్లాడుతూ -‘‘మనసుకు నచ్చిన అమ్మాయి కోసం ఓ యువకుడు సాగించిన అన్వేషణే ఈ సినిమా. అన్ని రకాల వాణిజ్య విలువలూ ఉన్న పూర్తి స్థాయి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. ఇంకా పాటల చిత్రీకరణ చేయాలి. ఈ జూన్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ తర్వాత నాకొచ్చి ఏడాదిన్నర విరామాన్ని ఈ సినిమా మరిచిపోయేలా చేస్తుంది’’ అని అభిజిత్ చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement