అప్పుడే కదా ఫ్యామిలీలో హ్యాపీ | Then family is happy :- Soha Ali Khan | Sakshi
Sakshi News home page

అప్పుడే కదా ఫ్యామిలీలో హ్యాపీ

May 13 2016 9:02 AM | Updated on Sep 3 2017 11:57 PM

అప్పుడే కదా ఫ్యామిలీలో హ్యాపీ

అప్పుడే కదా ఫ్యామిలీలో హ్యాపీ

సమానత్వం మా ఇంట్లో ఉంటుందని, తన భర్త పటౌడి లాండ్రీ బాగా చేస్తారని అలనాటి మేటి నటి షర్మిలా ఠాగూర్....

బాలీవుడ్ అందాల తార సోహా అలీఖాన్ నగరంలో తళుక్కుమన్నారు. తన తల్లి, అలనాటి అందాల నటి షర్మిలా ఠాగూర్‌తో కలిసి గురువారం నగరంలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొని అభిమానులతో ముచ్చటించారు.                                     
 

శ్రీనగర్‌కాలనీ: సమానత్వం మా ఇంట్లో ఉంటుందని, తన భర్త పటౌడి లాండ్రీ బాగా చేస్తారని అలనాటి మేటి నటి షర్మిలా ఠాగూర్ కితాబివ్వగా కూతురు హీరోయిన్ సోహా అలీఖాన్ అవునంటూ చమత్కరించారు. గురువారం బంజారాహిల్స్‌లోని తాజ్‌దక్కన్‌లో ఏరియల్-వర్ల్‌పూల్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న డాడ్స్ టు షేర్ ద లోడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమానత్వం కోసం, తండ్రులకు భారాన్ని తగ్గించి వారికి తోడుగా ఉండేలా చేస్తూ విలువలను కాపాడే ప్రయత్నమే ఈ కార్యక్రమమని, ఇందులో తాను,  అమ్మ భాగస్వామిని కావడం సంతోషంగా ఉందని నటి సోహా అలీఖాన్ అన్నారు.

ఇంటి పనులు కేవలం ఆడవారే చేయాలనే అపోహ దేశంలో ఉందని, అలాకాకుండా ఆ భారాన్ని మగవారు కూడా పంచుకుంటే కుటుంబం సంతోషంగా ఉంటుందన్నారు. పిల్లలు సైతం చిన్నతనం నుండే ఈ విధానానికి అలవాటుపడతారని నటి షర్మిలా ఠాగూర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా షేర్ ద లోడ్ ప్యాక్‌ను ఆవిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement