రూ. 100 కోట్ల మార్క్ను దాటేసింది | TheJungleBook Crosses ₹ 100 crores | Sakshi
Sakshi News home page

రూ. 100 కోట్ల మార్క్ను దాటేసింది

Apr 18 2016 10:51 AM | Updated on Sep 3 2017 10:11 PM

హాలీవుడ్ చిత్రం 'ది జంగిల్ బుక్' రికార్డు సృష్టిస్తోంది. భారత బాక్సాఫీసు వద్ద ఈ సినిమా కలెక్షన్ల జోరు కొనసాగుతోంది.

ముంబై: హాలీవుడ్ చిత్రం 'ది జంగిల్ బుక్' రికార్డు సృష్టిస్తోంది. భారత బాక్సాఫీసు వద్ద ఈ సినిమా కలెక్షన్ల జోరు కొనసాగుతోంది. పది రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు 100 కోట్ల మార్క్ దాటింది. విడుదలైన తర్వాత రెండో వారంలోనూ మంచి కలెక్షన్లు రాబడుతోంది. శుక్రవారం 8.02 కోట్లు, శనివారం 8.51 కోట్లు, ఆదివారం 10.67 కోట్ల రూపాయలను వసూలు చేసింది. పది రోజుల్లో 101.82 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చినట్టు ట్రేడ్ విశ్లేషకుడు తరణ్  ఆదర్శ్ ట్వీట్ చేశాడు. ఇప్పటి వరకు మన దేశంలో విడుదలైన ఏ హాలీవుడ్ చిత్రం కూడా ఇంతపెద్ద మొత్తంలో వసూళ్లు రాబట్టలేదు.

జాన్ ఫావ్ రియో దర్శకత్వంతో నిర్మించిన ఈ 3డీ లైవ్ ఫాంటసీ మూవీ.. భారతీయ చిత్రాలతో పోటీని తట్టుకుని విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.  ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు.  1894లో ఒక నవలగా విడుదలైన జంగిల్ బుక్ కథ సారాంశం ఆధారంగా కొత్త సాంకేతిక పరిజ్ఞానం జోడించి కన్నులకు కట్టినట్లుగా తీర్చిదిద్దారు. ఇందులో మోగ్లీ అనే పిల్లాడి పాత్రలో భారతీయ సంతతికి చెందిన పిల్లాడు నీల్ సేథి నటించాడు. ఏప్రిల్ 8న భారత్ లో ఈ సినిమా విడుదలైంది.

Advertisement
 
Advertisement
Advertisement