ముగ్గురు సూపర్ హీరోలు

సూపర్ మ్యాన్, బ్యాట్‌మ్యాన్ , కెప్టెన్ అమెరికా, ఐరన్‌మ్యాన్ లాంటి సూపర్‌హీరోల సినిమాలంటే సినీ అభిమానుల్లో ఎంతో క్రేజ్. వీళ్లందరూ ఒకే సినిమాలో కలిసి సందడి చేయడం హాలీవుడ్‌లో లేటెస్ట్ ట్రెండ్. సూపర్‌మ్యాన్, బ్యాట్‌మ్యాన్ పాత్రలతో ఓ సినిమా రావడానికి సిద్ధంగా ఉంది. ఇది ఇలా ఉండగా, తాజాగా కెప్టెన్ అమెరికా, ఐరన్‌మ్యాన్‌లు కూడా వెండితెరపై ఒకేసారి తమ విన్యాసాలతో ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ రెండు పాత్రలకూ మరో సూపర్ హీరో స్పైడర్‌మ్యాన్ పాత్ర కూడా జత కలిసింది.
ఈ మూడు సూపర్ హీరో పాత్రలూ కనిపించనున్న చిత్రం ‘కెప్టెన్ అమెరికా: సివిల్ వార్’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ చివరిలో స్పైడర్‌మ్యాన్ కనిపించడం సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా మారింది. రెండేళ్ల క్రితం ‘ఎమేజింగ్ స్పైడర్‌మ్యాన్’ చిత్రం తర్వాత స్పైడర్‌మ్యాన్ పాత్రతో ఏ సినిమా కూడా రాలేదు. ఈసారి వేసవికి వెండితెరపై ఐరన్‌మ్యాన్, కెప్టెన్ అమెరికా కాంబినేషన్‌లో ‘కెప్టెన్ అమెరికా: సివిల్ వార్ ’చిత్రంలో స్పైడర్‌బాయ్ సాహసాలు యాక్షన్ ప్రియులకు కనుల విందే అని వేరే చెప్పనక్కర్లేదేమో!
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి