తర్వాత ఎవరు? | Tharuvatha Evaru music launch | Sakshi
Sakshi News home page

తర్వాత ఎవరు?

Jul 20 2018 2:34 AM | Updated on Jul 12 2019 4:40 PM

Tharuvatha Evaru music launch - Sakshi

ప్రియాంక శర్మ, మనోజ్

మనోజ్, ప్రియాంక శర్మ జంటగా కమల్‌ కామరాజు ముఖ్యపాత్రలో తెరకెక్కిన చిత్రం ‘తరువాత ఎవరు’. జి. కృష్ణప్రసాద్, కె. రాజేష్‌ దర్శకత్వంలో    లక్ష్మిరెడ్డి కె, రాజేష్‌ కోడూరు నిర్మించారు. విజయ్‌ కురాకుల సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను జర్నలిస్ట్‌ పసుపులేటి రామారావు లాంచ్‌ చేశారు. మరో జర్నలిస్ట్‌ చందు రమేశ్‌ ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు.

చిత్ర దర్శకులు కృష్ణప్రసాద్, రాజేష్‌ మాట్లాడుతూ  ‘‘రియాలిటీ బేస్డ్‌ థ్రిల్లర్‌ మూవీ ఇది. నలుగురు కాలేజీ స్టూడెంట్స్‌ మధ్య జరిగే స్టోరీ ఇది. ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. మాకు సపోర్ట్‌ చేసిన టీమ్‌కి థ్యాంక్స్‌. ఆగస్టు 3న సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘నా తొలి చిత్రమిది. ఈ అవకాశం ఇచ్చిన మా దర్శకులకు, నిర్మాతలకు థ్యాంక్స్‌. ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మూవీ కూడా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు మనోజ్‌. కథానాయిక ప్రియాంక శర్మ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement