ఈ నగరానికి ఏమైంది? : రేపే ప్రీ రిలీజ్‌

Tharun Bhascker Ee Nagaraniki Emaindi Pre Release event On 25th June - Sakshi

మొదటి సినిమాతోనే ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు తరుణ్‌ భాస్కర్‌. పెళ్లి చూపులు లాంటి చిన్న సినిమాతో పెద్ద విజయాన్ని సాధించారు. గ్యాప్‌ తీసుకుని తన రెండో సినిమాతో మళ్లీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యారు. నీ గ్యాంగ్‌తో థియేటర్‌కి రా చూస్కుందాం అంటూ సినిమాపై ఆసక్తిని పెంచారు. 

నలుగురు స్నేహితుల పాత్రల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా యూత్‌ను ఆకర్షించేలా ఉంది. ఈ నగరానికి ఏమైంది? అంటూ అందరికీ పరిచయమైన యాడ్‌లోని లైన్‌ను టైటిల్‌గా పెట్టారు. సోషల్‌ మీడియాలో ఈ సినిమాపై పాజిటివ్‌ టాక్‌ వినిపిస్తోంది. సురేష్‌ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను రేపు (జూన్‌ 25) నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ఈ మూవీ జూన్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top