సెంటిమెంట్‌ను వదలని అజిత్‌ | Thala Ajith New Movie Launch And Titled Valimai | Sakshi
Sakshi News home page

సెంటిమెంట్‌ను వదలని అజిత్‌

Oct 20 2019 7:24 AM | Updated on Oct 20 2019 7:24 AM

Thala Ajith New Movie Launch And Titled Valimai - Sakshi

తమిళసినిమా: సెంటిమెంట్‌ అనేది అన్ని రంగాల్లోని వారికి ఉంటుంది. అయితే సినిమా వాళ్లకు కాస్ల ఎక్కువ అంటారు. మరి నటుడు అజిత్‌కు అలాంటి సెంటిమెంట్‌ ఉందో, లేదో గానీ, ఇటీవల ఆయన చిత్రాల పేర్లను చూస్తుంటే ఆయనికీ సెంటిమెంట్‌ ఉందని భావించాల్సి వస్తోంది. అజిత్‌ నటించిన వీరం, వేదాళం, వివేకం, విశ్వాసం చిత్రాల టైటిల్స్‌ అన్నీ వీ తోనే ప్రారంభమయ్యాయి. మంచి విజయాలను అందుకున్నాయి. కాగా తన కొత్త చిత్ర టైటిల్‌ వీతోనే మొదలవడం విశేషం. అవును విశ్వాసం, నేర్కొండపార్వై వంటి సంచలన విజయం సాధించిన చిత్రాల తరువాత అజిత్‌ నటిస్తున్న తాజా చిత్రం శుక్రవారం సాయంత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇది నేర్కొండ పార్వై చిత్ర నిర్మాత బోనీకపూర్, దర్శకుడు హెచ్‌.వినోద్, నటుడు అజిత్‌ కాంబినేషన్‌లోనే రూపొందనుండడం విశేషం. 

నేర్కొండ పార్వై చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్‌ నిర్మాత, నటి శ్రీదేవి భర్త బోనీకపూర్‌ వెంటనే మరో చిత్రం చేయడం, అదీ అజిత్‌ హీరోగానే నిర్మించడం విశేషం. ఇకపోతే ఇది నటుడు అజిత్‌కు 60వ చిత్రం అవుతుంది. ఇందులో ఆయన పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారిగా నటించనున్నట్లు సమాచారం. అదేవిధంగా ఇందులో ఆయనకు జంటగా నటి నయనతార నటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.అయితే ఈ విషయాన్ని చిత్ర వర్గాలు ప్రకటించలేదు.

కానీ చిత్ర టైటిల్‌ మాత్రం ప్రారంభం రోజునే వెల్ల డించడం మరో విశేషం. ఈ చిత్రానికి వలిమై అనే టైటిల్‌ను నిర్ణయించారు. వలిమై అంటే బాధ అని అర్థం. కాగా అజిత్‌ చిత్ర టైటిల్‌ కోసం ఆయన అభిమానులు నిర్మాణం చివరి వరకూ ఎదురు చూస్తుంటారు. అలాంటిది ఈ సారి ముందుగానే ప్రకటించడంతో వారు పండుగ చేసుకుంటున్నారు. దీనికి నీరవ్‌షా ఛాయాగ్రహణం, యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. వలిమై చిత్ర షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసి 2020 సమ్మర్‌ స్పెషల్‌గా తెరపైకి తీసుకురావడానికి చిత్ర వర్గాలు ప్రణాళికను రచించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement