తెనాలి.. ఫుల్‌గా నవ్వాలి!

tenali ramakrishna babl first released on look may 7 - Sakshi

తెనాలి రామకృష్ణ పేరు వినగానే పెదాలపై నవ్వు తన్నుకొస్తుంది. వికటకవిగా తెలుగువారికి ఆయన అంత సుపరిచితులు. ఇప్పుడు ఆయన పేరును గుర్తు చేస్తూ సందీప్‌ కిషన్, హన్సిక జంటగా ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఆ సినిమా పేరు  ‘తెనాలి రామకృష్ణ బి.ఎ.బి.ఎల్‌’. శ్రీ నీలకంఠేశ్వరస్వామి క్రియేషన్స్‌పై ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం అరవై శాతం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను మే 7న విడుదల చేయనున్నారు. సంగీతం: సాయికార్తీక్, కెమెరా: సాయిశ్రీరాం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top