స్పైతో సై

Tamanna May Act In Gopichand - Sakshi

గోపీచంద్‌ గూఢచారిగా మారి భారతదేశం బోర్డర్‌లో సాహసాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ గూఢచారికి జోడీ ఫిక్స్‌ అయ్యారని సమాచారం. తిరు దర్శకత్వంలో గోపీచంద్‌ హీరోగా స్పై థ్రిల్లర్‌ జానర్‌లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ఇండియా, పాకిస్థాన్‌ బోర్డర్‌లో జరుగుతోంది. ఇందులో గోపీచంద్‌ సరసన హీరోయిన్‌గా తమన్నా పేరుని పరిశీలిస్తున్నారట చిత్రబృందం. గోపీచంద్‌తో తమన్నా హీరోయిన్‌గా యాక్ట్‌ చేయడం ఇదే ఫస్ట్‌ టైమ్‌. ఆల్రెడీ ఈ సినిమాలో మరో కథనాయికగా బాలీవుడ్‌ భామ జరైన్‌ ఖాన్‌ను ఎంపిక చేశారు. సమ్మర్‌ స్పెషల్‌గా రిలీజ్‌ కానున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top