‘ఉంగరాల జుట్టుపై కంగనా పెటేంట్‌ తీసుకుందా’ | Taapsee Pannu Rects On Rangoli calling Her Kangana Ranauts Sasti Copy | Sakshi
Sakshi News home page

‘ఉంగరాల జుట్టుపై కంగనా పెటేంట్‌ తీసుకుందా’

Aug 8 2019 5:56 PM | Updated on Aug 8 2019 8:59 PM

Taapsee Pannu Rects On Rangoli calling Her Kangana Ranauts Sasti Copy - Sakshi

హీరోయిన్‌ తాప్సీ, కంగనా రనౌత్‌ సోదరి రంగోలి మధ్య ప్రారంభమైన మాటల యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. తాజాగా మరోసారి ఈ వివాదం తెర మీదకు వచ్చింది. ‘జడ్జ్‌మెంటల్‌ హై క్యా’ సినిమా ట్రైలర్‌ చూసి తాప్సీ చాలా బాగుందని మెచ్చుకుంది. అయితే రంగోలి ‘కంగనాను ప్రశంసించరు.. కానీ ఆమెను కాపీ కొడతారంటూ’ తాప్సీని విమర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా రంగోలి వ్యాఖ్యలపై తాప్సీ స‍్పందించారు.

తాప్సీ నటించిన  ‘మిషన్‌ మంగళ్‌’ సినిమా ప్రమోషన్లో మాట్లాడుతూ.. గతంలో కంగనా రనౌత్ గురించి నేను చేసిన వ్యాఖ్యలు నిజమైనవి. వాటి గురించి నేను ఎవరికి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పోతే నాకు, కంగనాకు ఇద్దరికి ఉంగరాల జుట్టు ఉంది. నేను ఉంగారాల జుట్టుతోనే జన్మించాను. అది నాకు నా తల్లిదండ్రుల నుంచి వచ్చింది. కంగనా ఉంగరాల జుట్టుపై పేటెంట్‌ హక్కులు తీసుకున్నారని నాకు తెలీదు. ఇది కాక ఇతర ఏ విషయాల్లో నేను కంగనాను కాపీ చేశానో నాకు అర్థం కావడం లేదు’ అన్నారు తాప్సీ.

‘పైగా నన్ను ‘సస్తా’(చౌక) అని కూడ అంటున్నారు. అవును నేను  అధిక పారితోషికం తీసుకునే నటిని కాను. అందువల్ల మీరు నన్ను అలా పిలవవచ్చు. ఒకవేళ నేను కాపీ కొట్టినట్లయితే.. ఆమె( కంగనా) మంచి నటి కాబట్టి దానిని నేను పొగడ్తగా మాత్రమే తీసుకుంటాను’ అని తాప్సీ ఘాటుగా స్పందించారు. ఈ విషయంలో తాను ఎవరీకి ప్రత్యేకంగా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తాప్సీ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement