సుశాంత్ సినిమా షురూ | Sushanth new movie shooting Started | Sakshi
Sakshi News home page

సుశాంత్ సినిమా షురూ

Mar 21 2015 10:27 PM | Updated on Sep 2 2017 11:11 PM

సుశాంత్ సినిమా షురూ

సుశాంత్ సినిమా షురూ

‘కాళిదాసు’, ‘కరెంట్’, ‘అడ్డా’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ హీరోగా మరో సినిమా ప్రారంభమైంది.

‘కాళిదాసు’, ‘కరెంట్’, ‘అడ్డా’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ హీరోగా మరో సినిమా ప్రారంభమైంది. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రీజీ ఫిలిమ్స్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో ఉగాది రోజున ప్రారంభమైంది. నాగార్జున పూజా కార్యక్రమాలు నిర్వహించి స్క్రిప్ట్‌ను దర్శకునికి అందించారు.
 
  హీరో సుశాంత్ ‘అందరికీ ఉగాది శుభాకాంక్షలు ’ అని డైలాగ్ చెప్పే సన్నివేశానికి అఖిల్ అక్కినేని కెమెరా స్విచాన్ చేయగా, నాగచైతన్య క్లాప్‌నిచ్చారు. సుమంత్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘శ్రీధర్ సీపాన మంచి కథ ఇచ్చారు. ఈ చిత్రంతో సుశాంత్‌కు భారీ హిట్ రావడం ఖాయం. ఏప్రిల్ 10 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కథ, మాటలు: శ్రీధర్ సీపాన, ఫైట్స్: కనల్ కణ్ణన్, ప్రొడక్షన్ కంట్రోలర్: ఎం.వి.ఎస్. వాసు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement