మనసు బంగారం

surya gifted gold coins for ngk movie technicians team - Sakshi

సూర్య లేటెస్ట్‌ సినిమా ‘యన్‌జీకే’ షూటింగ్‌ పూర్తయింది. కొన్ని నెలలుగా తనతో పాటు సినిమా అద్భుతంగా రావడానికి కృషి చేసిన  టీమ్‌ అందర్నీ అభినందించాలని భావించారు సూర్య. ఈ సినిమాకు పని చేసిన దాదాపు 120 మందికి గోల్డ్‌ కాయిన్స్‌ను బహుమతిగా అందించారు. దాంతో ‘మీ మనసు బంగారం’ అని సూర్యకు కితాబులు ఇస్తోంది కోలీవుడ్‌. సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో సూర్య, సాయి పల్లవి జంటగా యస్‌ఆర్‌ ప్రభు నిర్మించిన చిత్రం ‘యన్‌జీకే’ (నంద గోపాల కుమార్‌). పొలిటికల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top