
పోలీస్ స్టేషన్‌కు వెళ్లారట హీరో సూర్య. ఎవరైనా కంప్లైంట్ చేస్తే వెళ్లారా? లేక ఆయనే కంప్లైంట్ చేయడానికి వెళ్లారా? అనే విషయం ప్రస్తుతానికి సస్పెన్స్. దీపావళికి థియేటర్స్‌లో చూడాల్సిందే. సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందుతోన్న సినిమా ‘ఎన్‌జీకే’. ఇందులో రకుల్‌ప్రీత్‌సింగ్, సాయిపల్లవి కథానాయికలు. జగపతిబాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట. ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ మొదలైంది.
ఈ షూటింగ్‌లో పాల్గొనడానికే హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్ బుధవారం ముంబై నుంచి చెన్నై బయలుదేరారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ బ్యాక్‌డ్రాప్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. ‘‘లాంగ్ షెడ్యూల్ కోసం లైట్స్ ఆన్ అయ్యాయి. లైట్స్ ఆన్ ఫర్ దీపావళి’’ అని పేర్కొన్నారు సెల్వ రాఘవన్. అంటే దీపావళికి ‘ఎన్‌జీకే’ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు దర్శకుడు. ఈ సినిమాకు యువన్ శంకర్‌రాజా బాణీలు అందిస్తు్తన్నారు.