సన్నీ.. ఓ మైనపు బొమ్మ! | Sunny Leone's Wax Figure Being Readied For Madame Tussauds | Sakshi
Sakshi News home page

 సన్నీ.. ఓ మైనపు బొమ్మ!

Jan 20 2018 12:49 AM | Updated on Jan 20 2018 12:49 AM

Sunny Leone's Wax Figure Being Readied For Madame Tussauds - Sakshi

హాట్‌ స్టార్‌ సన్నీ లియోన్‌కు విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. ఇది వరకు ఖుష్బూ, నమితకు అభిమానులు పెట్టినటువంటి పాలరాతి విగ్రహం అనుకుంటే మీరు పొరబడ్డట్టే. ఇది మైనపు బొమ్మ. దీనిని ఏర్పాటు చేస్తున్నది అభిమానులు కాదండీ.. లండన్‌కు చెందిన ‘మేడమ్‌ తుస్సాడ్స్‌ వ్యాక్స్‌ మ్యూజియం’ వాళ్లు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మేడమ్‌ తుస్సాడ్స్‌ మ్యూజియంలో సన్నీ లియోన్‌ మైనపు బొమ్మ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. సన్నీ బొమ్మకు కావాల్సిన కొలతలను ఇటీవలే ముంబైలో తీసుకున్నారు.

ఈ వాక్స్‌ స్టాచ్యూ సన్నీ లియోన్‌ని పోలి ఉండటం కోసం దాదాపు 200పైగా కొలతలు, కొన్ని ఫొటోగ్రాఫ్‌లు కలెక్ట్‌ చేసుకున్నారు తుస్సాడ్స్‌ బృందం. ఈ మైనపు బొమ్మతో సన్నీ లియోన్‌ ‘అమితాబ్‌ బచ్చన్, అనిల్‌కపూర్, కరీనా కైఫ్, కరీనా కపూర్‌ వంటి స్టార్స్‌తో పాటుగా ఢిల్లీ తుస్సాడ్స్‌ వాక్స్‌ స్టాచ్యూ లిస్ట్‌లోకి చేరిపోతారు. ‘‘ఇది చాలా థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అండ్‌ వెరీ గ్రేట్‌ఫుల్‌ టూ మేడమ్‌ తుస్సాడ్స్‌. కొలతలు తీసుకోవటం చాలా మెమొరబుల్‌ ఎక్స్‌పీరియన్స్‌. నన్ను నేను చూసుకోవటానికి చాలా ఎగై్జటెడ్‌గా ఉన్నాను. నా ఫ్యాన్స్‌ రియాక్షన్‌ తెలుసుకోవడానికి ఎదురు చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు సన్నీ లియోన్‌. ఈ మైనపు బొమ్మని ఈ ఏడాది చివర్లో ఏర్పాటు చేయనున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement