breaking news
Wax Museum
-
'ప్రతిమ'దిలో రామాయణం
అయోధ్య: శ్రీరాముడి జన్మభూమి అయోధ్య.. మరో అద్భుత ఘట్టానికి సిద్ధమవుతోంది! ప్రపంచంలోనే మొట్టమొదటి రామాయణ ఇతివృత్తంతో కూడిన భారీ వ్యాక్స్ మ్యూజియం (మైనపు బొమ్మల ప్రదర్శన శాల) త్వరలో ఇక్కడ ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టును ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో.. దీపోత్సవం–2025 సందర్భంగా ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. శ్రీరామ జన్మభూమి మందిరం సమీపంలోని ’పరిక్రమ మార్గ్’లో 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ మ్యూజియం రూపుదిద్దుకుంటోంది. దాదాపు రూ.7.5 కోట్లతో నిర్మితమవుతున్న ఈ మ్యూజియం.. అయోధ్యలో మత పర్యాటకాన్ని మరింత పెంచడానికి దోహదపడుతుంది. 50 జీవం ఉట్టిపడే బొమ్మలు: మ్యూజియంలో మొత్తం 50 మంది రామాయణ ప్రధాన పాత్రల మైనపు బొమ్మలను ప్రదర్శించనున్నారు. వీటిలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణుడు, విభీషణుడు తదితర విగ్రహాలున్నాయి. ప్రతి బొమ్మా.. పాత్రల దుస్తులు, ముఖ కవళికలు, భంగిమల్లో జీవం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. గ్రౌండ్ ఫ్లోర్: రాముని బాల్యం, సీతాదేవి స్వయంవరం వంటి తొలి ఘట్టాలను ఇక్కడ ప్రదర్శిస్తారు. మొదటి అంతస్తు: 14 ఏళ్ల వనవాసం, సీతాపహరణం, లంకా దహనం, రామ–రావణ యుద్ధం వంటి కీలక ఘట్టాలను అద్భుతంగా ఆవిష్కరించారు. సెల్ఫీ పాయింట్: భక్తులు.. బాల రాముడి మైనపు విగ్రహం వద్ద సెలీ్ఫలు తీసుకునేందుకు ప్రత్యేక పాయింట్‌ను ఏర్పాటు చేశారు. తాదాత్మ్యం చెందేలా..: త్రీడీ లైటింగ్ ఎఫెక్ట్స్, వినసొంపైన సౌండ్స్కేప్స్ మ్యూజియాన్ని మరో స్థాయికి తీసుకువెళ్తాయి. దివ్య సుగంధం: మ్యూజియం లోపల త్రేతాయుగాన్ని గుర్తుకు తెచ్చే దివ్య సుగంధంతో పాటు, నిరంతరం ‘రామ తారక మంత్రం’పఠనం, రామ భజనలు వినిపిస్తాయి. నిర్మాణ శైలి: కేరళకు చెందిన ‘సునీల్ వ్యాక్స్ మ్యూజియం’సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను సంప్రదాయ దక్షిణ భారత నిర్మాణ శైలిలో తీర్చిదిద్దుతోంది. ప్రవేశ రుసుము: ఒక్కొక్కరికి రూ.100. ఒకేసారి 100 మంది సందర్శకులకు మాత్రమే ప్రవేశం కలి్పస్తారు. సౌకర్యాలు: పూర్తిగా ఎయిర్ కండిషన్ చేసిన ఈ మ్యూజియం వెలుపల పార్కింగ్, స్నాక్ జోన్లు, కాఫీ హౌస్, దక్షిణ, ఉత్తర భారతీయ వంటకాలతో ఫుడ్ కోర్టు వంటి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. భద్రత: ఇరవై నాలుగ్గంటలూ సీసీటీవీ నిఘా, అగ్నిమాపక భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేశారు.దీపోత్సవానికల్లా పూర్తి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, దీపోత్సవం నాటికి సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు తెలిపారు. ఈ వ్యాక్స్ మ్యూజియం అయోధ్య సాంస్కృతిక వైభవానికి కొత్త మెరుగులు దిద్దనుంది. -
మైఖేల్ జాక్సనా.. మంగళ్ పాండేనా?
లుథియానా : పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా తయారయ్యింది పంజాబ్‌కు చెందిన చంద్రశేఖర్ ప్రభాకర్ పరిస్థితి. ప్రముఖుల మైనపు విగ్రహాలను తయారు చేసే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంను సందర్శించాలని చాలా మంది ఔత్సాహికులు కోరుకుంటారు. ప్రభాకర్ కూడా ఆ కోవక చెందిన వారే. టుస్సాడ్స్ మ్యూజియం చూడగానే ఆయన కూడా అలాంటి మ్యూజియం ప్రారంభించాలని ఆరాటపడ్డారు. అందుకే 2005లో లుథియానాలో ప్రభాకర్ మైనపు విగ్రహాల మ్యూజియం ప్రారంభించారు. అబ్దుల్ కలామ్, మదర్ థెరిసా, సచిన్ టెండూల్కర్, బరాక్ ఒబామా, మైఖేల్ జాక్సన్ వంటి 52 మంది ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. చంద్రశేఖర్ మ్యూజియాన్ని చూసిన సందర్శకులు ట్విటర్ వేదికగా ఆయనపై జోకులు పేలుస్తున్నారు. సెలబ్రిటీల అసలు రూపానికీ, వారి విగ్రహాలకు అసలేమైనా పొంతన ఉందా అంటూ ఫొటోలతో ట్రోల్ చేస్తున్నారు. ‘మదర్ థెరిసా విగ్రహం హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్లా ఉంది’అని, ‘అబ్దుల్ కలాం హిల్లరీ క్లింటన్‌లా మారిపోయారని ఒక నెటిజన్ ట్వీట్ చేస్తే.. శశిథరూర్ అభిమాని కలాం విగ్రహాన్ని అలా మలచడంలో తప్పు లేదంటూ’ మరొకరు సెటైర్ వేశారు. ‘మ్యూజియం గనుక విగ్రహాలను చూసి ఆ సెలబ్రిటీ ఎవరో చెప్పాలనే పోటీ పెడితే ఒక్కరు కూడా గెలవలేరంటూ’ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. విమర్శలపై స్పందించిన చంద్రశేఖర్.. ‘టుస్సాడ్స్ మ్యూజియంలో అధునాతన టెక్నాలజీ అందుబాటులో ఉంటుంది. వారు సెలబ్రిటీలను సంప్రదించి కొలతలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ మేం సింగిల్ డైమెన్షన్ ఆధారంగా విగ్రహాలు రూపొందిస్తున్నాము. ఇది సవాలుతో కూడుకున్న పని. మ్యూజియం నెలకొల్పి నా వంతుగా ఏదైనా చేయాలనుకున్నాను. ప్రస్తుతం అదే చేస్తున్నాను అంటూ’ వివరణ ఇచ్చారు. Snapchat pictures iOS vs Android pic.twitter.com/FTcKaKJNyY — Pakchikpak Raja Babu (@HaramiParindey) April 2, 2018 Mother Teresa with APJ Hillary Kalamton pic.twitter.com/knAmQ0DRdC — Divya (@divya_16_) April 2, 2018 When you have to make a wax statue of Dr Kalam but you are a Shashi Tharoor fan. pic.twitter.com/Un2pXa52xy — Sand-d Singh (@Sand_In_Deed) April 2, 2018 The wax museum should start this contest. No one will get it right pic.twitter.com/0MFM15mWjw — P.R. (@pr_akash_raj) April 2, 2018 Rajnath Singh in drag 😁 pic.twitter.com/h6sE5EBJ3c — Amlan عملان अम्लान Dutta (@orphean_warbler) April 1, 2018 I have so many questions about the wax museum in the last RT! Why is Obama blonde? Why does Sachin look like an extra from 'Bhabhiji Ghar Par Hai' Why make Kalam a white lady? 😂 pic.twitter.com/Y1bOIdsMHD — Sahil Rizwan (@SahilRiz) April 2, 2018 -
బ్యాంకాక్‌లో బాహుబలి.. లండన్‌లో కట్టప్ప
ముందు బాహుబలి (ప్రభాస్) బొమ్మ.. ఇప్పుడు కట్టప్ప (సత్యరాజ్) బొమ్మ కూడా కనువిందు చేయనుంది. ఎక్కడ అంటే? మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో. తుస్సాడ్స్ బ్యాంకాక్ శాఖలో ఇప్పటికే బాహుబలి కొలువు దీరాడు. ఇప్పుడు లండన్ శాఖలో కట్టప్ప కనిపించబోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకునే ప్రముఖుల మైనపు విగ్రహాలను తుస్సాడ్స్ వారు మ్యూజియంలో ప్రతిష్టించే విషయం తెలిసిందే. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ మైనపు విగ్రహాన్ని బాహుబలి గెటప్‌లోనే ప్రతిష్టించారు. ఇదే సినిమా ద్వారా బోలెడంత పాపులార్టీ తెచ్చుకున్న సత్యరాజ్ విగ్రహాన్ని కట్టప్ప గెటప్‌లో పెట్టాలని తుస్సాడ్స్ నిర్ణయించుకుంది. త్వరలో సత్యరాజ్‌ని కలిసి విగ్రహ కొలతలు తీసుకోనున్నారు. లండన్ తుస్సాడ్స్‌లో చోటు సంపాదించుకోబోతున్న తొలి తమిళ నటుడు సత్యరాజే కావడం విశేషం. తమిళంలో ఆయన దాదాపు 200 పై చిలుకు సినిమాలు చేసినా ఒక్క ‘బాహుబలి’ ఆయన్ను వరల్డ్ వైడ్‌గా పాపులర్ చేసేసింది. -
సన్నీ.. ఓ మైనపు బొమ్మ!
హాట్ స్టార్ సన్నీ లియోన్‌కు విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. ఇది వరకు ఖుష్బూ, నమితకు అభిమానులు పెట్టినటువంటి పాలరాతి విగ్రహం అనుకుంటే మీరు పొరబడ్డట్టే. ఇది మైనపు బొమ్మ. దీనిని ఏర్పాటు చేస్తున్నది అభిమానులు కాదండీ.. లండన్‌కు చెందిన ‘మేడమ్ తుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియం’ వాళ్లు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో సన్నీ లియోన్ మైనపు బొమ్మ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. సన్నీ బొమ్మకు కావాల్సిన కొలతలను ఇటీవలే ముంబైలో తీసుకున్నారు. ఈ వాక్స్ స్టాచ్యూ సన్నీ లియోన్ని పోలి ఉండటం కోసం దాదాపు 200పైగా కొలతలు, కొన్ని ఫొటోగ్రాఫ్‌లు కలెక్ట్ చేసుకున్నారు తుస్సాడ్స్ బృందం. ఈ మైనపు బొమ్మతో సన్నీ లియోన్ ‘అమితాబ్ బచ్చన్, అనిల్‌కపూర్, కరీనా కైఫ్, కరీనా కపూర్ వంటి స్టార్స్‌తో పాటుగా ఢిల్లీ తుస్సాడ్స్ వాక్స్ స్టాచ్యూ లిస్ట్‌లోకి చేరిపోతారు. ‘‘ఇది చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ వెరీ గ్రేట్ఫుల్ టూ మేడమ్ తుస్సాడ్స్. కొలతలు తీసుకోవటం చాలా మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. నన్ను నేను చూసుకోవటానికి చాలా ఎగై్జటెడ్‌గా ఉన్నాను. నా ఫ్యాన్స్ రియాక్షన్ తెలుసుకోవడానికి ఎదురు చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు సన్నీ లియోన్. ఈ మైనపు బొమ్మని ఈ ఏడాది చివర్లో ఏర్పాటు చేయనున్నారు. -
మేడమ్ టుస్సాడ్స్‌లో శ్రేయా ఘోషాల్‌కు చోటు
న్యూఢిల్లీ: ఇండియాలో ఏర్పాటు చేస్తున్న మేడమ్ టుస్సాడ్ వ్యాక్స్ మ్యూజియంలో ప్రముఖ గాయకురాలు శ్రేయా ఘోషాల్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఈ మ్యూజియం ప్రారంభం కానుంది. దీంతో ఆలోగా మైనపు విగ్రహాన్ని సిద్ధం చేసేందుకు మేడమ్ టుస్సాడ్ మ్యూజియం నిర్వాహకులు అవసరమైన కొలతల్ని శ్రేయా నుంచి తీసుకున్నారు. ఈ విషయమై శ్రేయా మాట్లాడుతూ... ‘నిజంగా నాకు చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో నా మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నా. సెలబ్రిటీలతోపాటు ప్రతిభావంతుల విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేయాలని భావించిన నిర్వాహకులు నన్ను పరిగణనలోకి తీసుకోవడం ఆనందంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, అమెరికన్ పాప్‌స్టార్ లేడీ గగా వంటి ప్రముఖుల సరసన నాకు చోటు దక్కుతోంది. ఓ రకంగా ఇది అమరత్వంతో సమానమే. ఇటువంటి గొప్ప ఆలోచన చేసిన మ్యూజియం నిర్వాహకులకు థ్యాంక్స్’ అంటూ పట్టలేని సంతోషాన్ని వ్యక్తం చేసింది. తేరీ మేరీ, డోలా రె డోలా రె, దీవానీ మాస్తానీ, అగర్ తుమ్ మిల్ జావో, సున్ రహా హై, పియా ఓ రె పియా.. తదితర పాటలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన శ్రేయాకు ఇది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొస్తుందని పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆశాభావం వ్యక్తం చేశారు. -
త్వరలో మరో వ్యాక్స్ మ్యూజియం!
రాజస్థాన్‌లోని నహర్‌గఢ్ కోట త్వరలో వ్యాక్స్ వెలుగులు కురిపించనుంది. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల మైనపు, సిలికాన్ విగ్రహాల ప్రదర్శనకు ఈ కోట నిలయంగా మారనుంది. ప్రసిద్ధ వ్యక్తులు, సాంస్కృతిక చిహ్నాలు, బాలీవుడ్ హాలీవుడ్ నటులు, క్రీడలు, చరిత్ర, సంగీతం, సాహిత్యంతో పాటు పాప్ స్టార్ల మైనపు విగ్రహాలను పర్యాటకులు, సందర్శకులు అతి దగ్గరగా వీక్షించేందుకు త్వరలో జైపూర్ వ్యాక్స్ మ్యూజియం సిద్ధమౌతోంది. రాజస్థాన్ రాజధాని నగరం జైపూర్‌లో గల నహర్‌గఢ్ కోటలో త్వరలో వ్యాక్స్ మ్యూజియం ప్రారంభం కానుంది. పర్యాటకులను ఆకట్టుకునే దిశగా చర్యలు చేపట్టిన పురావస్తు సంగ్రహాలయాల శాఖ ఇప్పటికే ఇక్కడ సౌండ్ అండ్ లైట్ షో ప్రదర్శించాలని నిర్ణయించగా.. తాజాగా వ్యాక్స్ విగ్రహాల ప్రదర్శనకూ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది. వారసత్వ నిర్మాణాలకు, కోటలకు నెలవైన జైపూర్.. ప్రపంచంలోనే మూడో కేంద్రంగా గుర్తింపు పొందింది. రాత్రిపూట పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఇప్పటికే నగరంలో ఆల్బర్ట్ హాల్ మ్యూజియంను ప్రారంభించారు. ప్రస్తుతం వ్యాక్స్ మ్యూజియం ఏర్పాటుతో సందర్శకులను మరింత ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. లండన్‌లోని సుప్రసిద్ధ మేడమ్ టస్సాడ్స్ మ్యూజియం తరహాలో వ్యాక్స్ మ్యూజియంలు పలుచోట్ల ప్రారంభమయ్యాయి. మన దేశంలో పుణె సమీపంలోని లోనావాలలో కూడా వ్యాక్స్ మ్యూజియం ఉంది. అక్కడ కూడా పలువురు ప్రముఖుల మైనపు విగ్రహాలున్నాయి.


