గుర్తుపట్టలేనంతగ సన్నీలియోన్‌ | Sunny Leone’s look for her next project reveals | Sakshi
Sakshi News home page

గుర్తుపట్టలేనంతగ సన్నీలియోన్‌

Sep 19 2017 11:47 AM | Updated on Sep 22 2017 9:21 PM

Sunny Leone’s look for her next project reveals

ఫేస్‌ ప్యాక్‌లో సన్నీలియోన్‌

ఫోటోలో ఉన్న బాలీవుడ్‌ బ్యూటీని గుర్తు పట్టారా. అస్సలు గుర్తుపట్టలేక పోతున్నారు కదా.

ఫోటోలో ఉన్న బాలీవుడ్‌ బ్యూటీని గుర్తు పట్టారా. అస్సలు గుర్తుపట్టలేక పోతున్నారు కదా. అయితే మీకో క్లూ. ఇటీవల కేరళలో ఓ షాప్‌ ఓపెనింగ్‌కు వచ్చినప్పుడు ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు.. అదేనండీ పొర్న్ స్టార్‌గా ఓ వెలుగు వెలిగి, బాలీవుడ్‌లో నటిగా స్థిరపడ్డ సన్నీ లియోన్. సన్నీకి యూత్‌లో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని సన్నీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. తన తదుపరి ప్రాజెక్టులో నటిస్తున్న పాత్రకు అనుగుణంగా ప్రొస్తేటిక్స్ వేసుకుని తీసిన ఫోటోను పోస్ట్‌ చేసింది.

ఇప్పటి వరకు మీరు చూడని విధంగా నా తదుపరి ప్రాజెక్ట్‌ కోసం రెడీ అవుతున్నా.. అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. అయితే మేకప్‌ వేసుకోవడానికి ముందు ఓ కాటన్‌తో పూర్తిగా చుట్టి అసలు ఏమాత్రం మొహం కనిపించకుండా ఉన్న మరో ఫోటోను కూడా సన్నీ పోస్ట్‌ చేసింది. మెడిటేషన్‌ చేస్తున్నట్టుగా కూర్చొని ఉన్న ఆ ఫోటోకు.. నన్ను నేను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నా అంటూ ఓ కామెంట్‌ పెట్టింది. అయితే మేకప్‌ పూర్తిగా వేయకముందు తీసిన ఫోటోలు కావడంతో తర్వాతి సినిమాలో ఎలాంటి పాత్రలో సన్నీ నటిస్తోందో అని ఆమె అభిమానులు చర్చిస్తున్నారు. పూర్తిగా మేకప్‌ వేసుకుంటే  సన్నీ ఎలా ఉంటుందో చూడాలని ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement