కొత్త కాన్సెప్ట్‌తో కామెడీ | Sundeeep Kishan's Joru to release on Nov 7 | Sakshi
Sakshi News home page

కొత్త కాన్సెప్ట్‌తో కామెడీ

Nov 1 2014 11:51 PM | Updated on Sep 2 2017 3:43 PM

కొత్త కాన్సెప్ట్‌తో కామెడీ

కొత్త కాన్సెప్ట్‌తో కామెడీ

‘గుండెల్లో గోదారి’తో ప్రశంసలందుకున్న దర్శకుడు కుమార్ నాగేంద్ర రెండో ప్రయత్నం ‘జోరు’. సందీప్‌కిషన్, ‘ఊహలు గుసగుసలాడే’ ఫేమ్ రాశీ ఖన్నా, సుష్మా, ప్రియా బెనర్జీ ముఖ్యతారలు.

 ‘గుండెల్లో గోదారి’తో ప్రశంసలందుకున్న దర్శకుడు కుమార్ నాగేంద్ర రెండో ప్రయత్నం ‘జోరు’. సందీప్‌కిషన్, ‘ఊహలు గుసగుసలాడే’ ఫేమ్ రాశీ ఖన్నా, సుష్మా, ప్రియా బెనర్జీ ముఖ్యతారలు. ఈ నెల 7న రిలీజ్ కానున్న చిత్రం గురించి, దర్శకుడు ‘సాక్షి’తో మాట్లాడుతూ, ‘‘నా తొలి చిత్రానికి భిన్నంగా పూర్తి వినోదాత్మకంగా సాగే సినిమా ఇది. నేటి యువతరం కోరుకొనే రీతిలో ప్రతి సన్నివేశం ‘జోరు’గా సాగుతుంది. ఒకే పాత్రను ముగ్గురు పోషించడమనే వినూత్న కాన్సెప్ట్ అనుసరించాం. పాత్రల మధ్య గందరగోళంతో ప్రేక్షకు లకు బోలెడంత వినోదం వస్తుంది’’ అని వివరించారు. కథా పరంగా ముగ్గురు నాయికలకూ ప్రాధాన్యమున్న ఈ చిత్రం గురించి నిర్మాతలు అశోక్, నాగార్జున మాట్లాడుతూ,‘‘సినిమా చకచకా సాగుతుంది. బ్రహ్మానందం, సప్తగిరి, పృథ్వీరాజ్ కామెడీ మరో హైలైట్’’ అని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement