‘మా విజయవాడ అబ్బాయిలు చాలా రొమాంటిక్‌’ | Sumanth Ashwin Niharika Happy Wedding Trailer | Sakshi
Sakshi News home page

Jun 30 2018 11:08 AM | Updated on Jun 30 2018 3:21 PM

Sumanth Ashwin Niharika Happy Wedding Trailer - Sakshi

ఒక్కమనసు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మెగా వారసురాలు నిహారిక కొణిదెల తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవల కోలీవుడ్‌లోనూ అడుగుపెట్టిన నిహారిక త్వరలో హ్యాపీ వెడ్డింగ్‌సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. నిర్మాత ఎంఎస్‌ రాజు తనయుడు సుమంత్ అశ్విన్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు లక్ష్మణ్ కర్య దర్శకుడు.

యువీ క్రియేషన్స్, పాకెట్ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ఇటీవల ఓ డిఫరెంట్ వీడియోతో నిహారిక ఆకట్టుకోగా చిత్ర  ట్రైలర్‌ను యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ తన సోషల్‌ మీడియా పేజ్‌ ద్వారా రిలీజ్‌ చేశారు. ఫిదా ఫేం శక్తికాంత్‌ సంగీతమందిస్తున్న ఈ సినిమాకు తమన్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement