సుడిగాలి దెయ్యమా? | Sudigali Movie Opening | Sakshi
Sakshi News home page

సుడిగాలి దెయ్యమా?

Aug 17 2016 11:44 PM | Updated on Sep 4 2017 9:41 AM

సుడిగాలి దెయ్యమా?

సుడిగాలి దెయ్యమా?

‘సుడిగాలి’ అనగానే చాలామందిలో దెయ్యం అనే భావన ఉంది. మరి సుడిగాలి నిజంగా దెయ్యమా?

‘సుడిగాలి’ అనగానే చాలామందిలో దెయ్యం అనే భావన ఉంది. మరి సుడిగాలి నిజంగా దెయ్యమా? కాదా? అనే కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘సుడిగాలి’. వెంకటేష్ గౌడ్, మల్లేష్ యాదవ్, ప్రాచి అధికారి, కులకర్ణి మమత ప్రధాన పాత్రల్లో రమేశ్ అంకం దర్శకత్వంలో చెట్టిపల్లి వెంకటేష్ గౌడ్, బిరాధార్ మల్లేష్ యాదవ్ నిర్మిస్తున్న ఈ నూతన చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి లయన్ సాయి వెంకట్ కెమేరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ క్లాప్ కొట్టారు.
 
  రంగ రవీందర్ గుప్తా గౌరవ దర్శకత్వం వహించారు.రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ-‘‘చాలామంచి కథ. యువతరంతో పాటు అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కిస్తారనే నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నారు. ‘‘సుడిగాలిని కథాంశంగా తీసుకుని నిర్మిస్తున్న చిత్రమిది. హారర్‌తో పాటు వినోద అంశాలన్నీ ఉంటాయి. ఇప్పుడొస్తున్న చిత్రాలకు భిన్నంగా మా చిత్రం ఉంటుందని చెప్పగలను’’ అని దర్శకుడు తెలిపారు. నరసింహ వర్మ, సుహాసిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రాప్ రాక్ షకీల్, సమర్పణ: చెట్టిపల్లి లక్ష్మి.
 

Advertisement
 
Advertisement
Advertisement