సమ్మోహనం సెన్సార్‌ పూర్తి

Sudheer Babu Sammohanam Movie Gets U Certificate - Sakshi

ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాలంటే ఫ్యామిలీ అంతా హాయిగా కూర్చొని చూడొచ్చు. సుదీర్‌ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం సమ్మోహనం. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌, టీజర్‌, ట్రైలర్‌ అన్నింటికి పాజిటివ్‌ కామెంట్స్‌ వచ్చాయి. సినిమాలోని మాటలు, పాటలు, లొకేషన్లు, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, వినోదం ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. 

జూన్‌ 15న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ఇటీవలె సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్‌ సభ్యుల కత్తెరకు ఎలాంటి పని చెప్పకుండా.. ఈ సినిమా క్లీన్‌ యూ సర్టిఫికెట్‌ను పొందింది. జూన్‌ 10న జరుగుబోతున్న ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు సూపర్‌స్టార్‌​ మహేష్‌ బాబు ముఖ్య అతిథిగా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సుధీర్‌బాబుకు జోడీగా అదితి రావు హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు వివేక్‌సాగర్‌ సంగీతాన్ని అందించారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top