మహేష్ బాటలో శృతి | sruthi hasan adopting a village | Sakshi
Sakshi News home page

మహేష్ బాటలో శృతి

Aug 30 2015 11:05 AM | Updated on Sep 3 2017 8:25 AM

మహేష్ బాటలో శృతి

మహేష్ బాటలో శృతి

హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు స్టార్ హీరోయిన్లందరూ చిన్న పిల్లలను దత్తత తీసుకోవటం చాలా కామన్.. అయితే తాజాగా ఈ లిస్ట్ లో మరో అందాల భామ చేరనుంది. సౌత్ తో పాటు నార్త్ ఇండస్ట్రీలో....

హీరోయిన్ శృతి హాసన్..ప్రిన్స్ మహేశ్ బాబు బాటలో నడుస్తోంది. సౌత్ తో పాటు నార్త్ ఇండస్ట్రీలో కూడా వరుస సక్సెస్ లతో టాప్ ప్లేస్ కి చేరిన శృతి హాసన్ త్వరలో ఓ ఊరిని దత్తత తీసుకోవటానికి  ప్లాన్ చేసుకుంటోంది. ఇదే కాన్సెప్ట్ తో తెరకెక్కిన శ్రీమంతుడు సినిమాలో హీరోగా నటించిన మహేష్ ఇప్పటికే రెండు గ్రామాలు దత్తత తీసుకోగా, హీరోయిన్ గా నటించిన శృతిహాసన్ కూడా అదే ప్రయత్నాల్లో ఉంది.

ఇటీవలే నిర్మాతగా మారి, షార్ట్ ఫిలింస్ ను ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ బ్యూటి... ఔత్సాహిక కళాకారులకు చేయూతనందిస్తానంటోంది. మంచి కథ, కథనాలు, మ్యూజిక్ తో వస్తే, తన బ్యానర్ పై సినిమాలు తెరకెక్కించడానికి కూడా సిద్దమని ప్రకటించింది. అయితే ఊరిని దత్తత తీసుకోవాలన్న ఆలోచన తనకు శ్రీమంతుడు సినిమాతో మాత్రం రాలేదట.. తన తండ్రి కమల్ హాసన్ స్ఫూర్తితోనే ఈ ఆలోచన చేస్తున్నట్టుగా చెపుతోంది శృతి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement