సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ | Sakshi
Sakshi News home page

సైంటిఫిక్‌ థ్రిల్లర్‌

Published Sun, Feb 5 2017 11:02 PM

సైంటిఫిక్‌ థ్రిల్లర్‌

‘బాహుబలి, భజరంగీ భాయ్‌జాన్‌’ వంటి అద్భుతమైన చిత్రాలకు కథ అందించి, ‘రాజన్న’ మూవీతో డైరెక్టర్‌గా తన సత్తా చాటిన విజయేంద్రప్రసాద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘శ్రీవల్లీ’. రజత్, మాజీ మిస్‌ ఇండియా నేహా హింగే జంటగా రాజ్‌కుమార్‌ బృందావనం నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

నిర్మాత మాట్లాడుతూ– ‘‘విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన సైంటిఫిక్‌ ఎరోటిక్‌ థ్రిల్లర్‌ ఇది. ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్లో ఆసక్తి, ఉత్కంఠ రేకెత్తిస్తాయి. టీజర్, ట్రైలర్, ఆడియోకి మంచి స్పందన వస్తోంది. ట్రైలర్‌ బాగుందని  పలువురు ప్రముఖులు ఫోన్‌ చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: సునీత రాజ్‌కుమార్‌.

Advertisement
 
Advertisement
 
Advertisement