ఆమె అపురూపం | Srimati Bangaram Movie | Sakshi
Sakshi News home page

ఆమె అపురూపం

Jun 29 2015 11:01 PM | Updated on Sep 3 2017 4:35 AM

ప్రతి భర్త తన భార్యను బంగారంలా భావిస్తూ, అపురూపంగా చూసుకుంటే ప్రతి ఇల్లు నందనవనం అవుతుందనే కథాంశంతో రూపొందిన చిత్రం

 ప్రతి భర్త తన భార్యను బంగారంలా భావిస్తూ, అపురూపంగా చూసుకుంటే ప్రతి ఇల్లు నందనవనం అవుతుందనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘శ్రీమతి బంగారం’. రిషి, రాజీవ్ కనకాల, ప్రియాంక ముఖ్య తారలుగా శ్రీ మహేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై చెన్న శ్రీనివాస్, కొత్త సత్యనారాయణరెడ్డి నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో రొమాన్స్, కామెడీ అన్నీ ఉంటాయి. అంతర్లీనంగా ఓ సందేశం కూడా ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: సిద్ధ బాపు, నిర్వహణ: జీవీ సత్యనారాయణ.
 

Advertisement
 
Advertisement
Advertisement