ఆయన పెద్ద కాంత్‌... నేను చిన్న కాంత్‌ | Srikanth starrer 'Operation 2019' gets a release date | Sakshi
Sakshi News home page

ఆయన పెద్ద కాంత్‌... నేను చిన్న కాంత్‌

Nov 29 2018 3:02 AM | Updated on Nov 29 2018 5:26 AM

Srikanth starrer 'Operation 2019' gets a release date - Sakshi

శ్రీకాంత్‌

‘‘ఆపరేషన్‌ 2019’ నా 125వ చిత్రం. పాత్ర బావుంటే ఏ సినిమా అయినా ఓకే. మల్టీస్టారర్‌ సినిమాలు, విలన్‌ పాత్రలూ చేస్తాను. కేవలం హీరోగానే సినిమాలు చేయాలనుకోవడం లేదు. కానీ, లైఫ్‌ లాంగ్‌ సినిమాలు చేస్తూనే ఉంటాను’’ అని శ్రీకాంత్‌ అన్నారు. ఆయన హీరోగా కరణం బాబ్జీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆపరేషన్‌ 2019’. మంచు మనోజ్, సునీల్‌ కీలక పాత్రలు చేశారు. అలివేలమ్మ ప్రొడక్షన్స్‌ సమర్పణలో అలివేలు నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్‌ 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ పంచుకున్న విశేషాలు...

► ‘ఆపరేషన్‌ దుర్యోధన’ చిత్రం తరహాలోనే ఈ ‘ఆపరేషన్‌ 2019’ కూడా పొలిటికల్‌ సెటైర్‌గా ఉంటుంది. ఏ పార్టీనో విమర్శించాలని చేసింది కాదు. నాయకులు, ప్రజలకు కనెక్ట్‌ అయ్యే పాయింట్స్‌ ఉన్నాయి. ఓటు విలువని కూడా చూపించాం. పదునైన డైలాగ్స్‌ ఉన్నాయి.

► చిన్న రైతు కుటుంబంలో పుట్టి విదేశాలు వెళ్లి తిరిగొచ్చిన హీరో సొంత రాష్ట్రానికి ఏదైనా చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో రాజకీయ నాయకుడిగా ఎలా మారాడు? తను అనుకున్నది సాధించాడా? లేదా? అన్నదే చిత్రకథ. ఇందులో నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర చేశాను. మంచు మనోజ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా చేశారు. సునీల్‌ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తారు.

► ప్రతి సినిమా హిట్‌ అవ్వాలనే చేస్తాం. కొన్ని ప్రేక్షకులను అలరించవు.. బాధగా ఉంటుం ది. ‘యుద్ధం శరణ ం’ సినిమాలో విలన్‌గా నటించా. అది సూపర్‌ హిట్‌ అయ్యుంటే విలన్‌గా బిజీ అయిపోయేవాడినేమో?.

► 2019 ఎలక్షన్స్‌ని దృష్టిలో పెట్టుకునే ఈ చిత్రం స్టార్ట్‌ చేశాం. ఈ లోపు ఎలక్షన్స్‌ ముందుకు వచ్చాయి. అందుకే త్వరగా రిలీజ్‌ చేస్తున్నాం. నేను, బాబ్జీ కలిసి ‘మెంటల్‌ పోలీస్‌’ సినిమా చేశాం. అతని స్టైల్‌ నచ్చింది. అందుకే మళ్లీ పని చేశాం. సినిమాలు సొసైటీని మారుస్తాయి అని అనుకోకూడదు. కానీ, వాటి ప్రభావం మాత్రం ఉంటుంది.   

► రజనీకాంత్‌గారి ‘2.0’కి పోటీగా వస్తున్నా అంటున్నారు. ఆయనతో పోటీ ఏంటండి? ఆయన పెద్ద కాంత్, నేను చిన్న కాంత్‌ (నవ్వుతూ). ఏ సినిమా బాగుంటే ఆ థియేటర్స్‌కి ప్రేక్షకులు వస్తారు.

► చిన్న అబ్బాయి రోహన్‌ ప్రభుదేవాగారితో ఓ సినిమా చేస్తున్నాడు. పెద్దబ్బాయి రోషన్‌ని వచ్చే ఏడాది లాంచ్‌ చేయాలనుకుంటున్నాం. ప్రస్తుతం నేను ‘తెలంగాణ దేవుడు, మార్షల్‌’ అనే సినిమాల్లో నటిస్తున్నాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement