
పెళ్లి కళ వచ్చేసింది...
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం ఈ నెల 28న బెంగళూరులోని ఫామ్‌హౌస్‌లో జరగనున్న విషయం తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం ఈ నెల 28న బెంగళూరులోని ఫామ్‌హౌస్‌లో జరగనున్న విషయం తెలిసిందే. వివాహ వేడుకల్లో భాగంగా శ్రీజను గురువారం పెళ్లికూతుర్ని చేశారు. ఆ సందర్భంగా కజిన్స్ అల్లు శిరీష్, నీహారిక, సొంత అక్క సుస్మితతో కలసి శ్రీజ దిగిన సెల్ఫీ ఇది. ‘‘మా ఇంట్లో శ్రీజ పెళ్లికూతురు ఫంక్షన్ జరిగింది’’ అంటూ ఈ ఫొటోను అల్లు శిరీష్ ట్విట్టర్లో పెట్టారు.