శ్రీదేవి పోస్టుమార్టం పూర్తి 

Sridevi postmortem compleeted in dubai - Sakshi

సాక్షి, ముంబై: ప్రముఖ నటి శ్రీదేవి మరణవార్తతో భారతీయ చిత్రసీమ శోకసంద్రంలో మునిగిపోయింది. శ్రీదేవి నిన్న రాత్రి దుబాయిలో గుండెపోటుతో మృతిచెందారు. దుబాయ్‌లోని రషీద్‌ ఆసుపత్రిలో ఇప్పటికే శ్రీదేవి పోస్టుమార్టం పూర్తయింది. ఇంకా దానికి సంబంధించిన నివేధిక రావాల్సి ఉంది. డెత్‌ సర్టిఫికేట్‌ ఆలస్యంగా విడుదల చేయనున్నారు. దౌత్య వ్యవహారాల కారణంగా భౌతికాయం తరలింపు ఆలస్యమవుతోంది. శ్రీదేవి భౌతికాయం తెల్లవారుజామున ముంబై చేరుకునే అవకాశం ఉంది.  శ్రీదేవి భౌతికాయం కోసం  బంధువులు, అభిమానులు ముంబైలో ఎదురుచూస్తున్నారు.

రేపు శ్రీదేవి ఇంటి నుంచి మెహబూబా స్టూటియోకు పార్థివదేహాన్ని తరలిస్తారు. జుహూలోని శాంతా క్రజ్‌ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి తమ అభిమాన తారను చివరిసారిగా చూడాలన్న ఆత్రుతతో శ్రీదేవి ఇంటి ముందు అభిమానులు పోటెత్తారు. ముంబైలోని చార్‌బంగ్లా పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top