టాలీవుడ్‌ టు హాలీవుడ్‌ | Sri Raj's Hollywood entry as hero in 'Bhadham Bee Care Full Brotheru' | Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌ టు హాలీవుడ్‌

Jul 16 2017 1:26 AM | Updated on Sep 5 2017 4:06 PM

టాలీవుడ్‌ టు హాలీవుడ్‌

టాలీవుడ్‌ టు హాలీవుడ్‌

‘భద్రమ్‌ బీ కేర్‌ ఫుల్‌ బ్రదరూ’లో హీరోగా నటించిన శ్రీ రాజ్‌ హాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనున్నారు. ‘

‘భద్రమ్‌ బీ కేర్‌ ఫుల్‌ బ్రదరూ’లో హీరోగా నటించిన శ్రీ రాజ్‌ హాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనున్నారు. ‘రష్‌ అవర్‌’ మూడు భాగాలతో పాటు పలు హాలీవుడ్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన బ్రెట్‌ రాట్నర్‌ ఈ చిత్రానికి దర్శకుడు.

హాలీవుడ్‌ చిత్రంలో ఛాన్స్‌ దక్కించుకున్న సందర్భంగా శ్రీరాజ్‌ మాట్లాడుతూ– ‘‘నటనంటే నాకు ప్రాణం. అందుకే అమెరికాలోని న్యూయార్క్‌ ఫిల్మ్‌ ఆకాడమీలో ఫిల్మ్‌ మేకింగ్‌ అండ్‌ యాక్టింగ్‌ కోర్సు చేశాను. ‘రష్‌ అవర్‌’ వంటి బ్లాక్‌ బ్లస్టర్‌ చిత్రాలను రూపొందించిన బ్రెట్‌ రాట్నర్‌ దర్శకత్వంలో సినిమా చేయడం హ్యాపీగా ఉంది. న్యూయార్క్‌ నేపథ్యంలో రెండు జంటల మధ్య సాగే మ్యూజికల్‌ లవ్‌స్టోరియే ఈ చిత్రం. ఇందులో నాది టాక్సీ డ్రైవర్‌ పాత్ర. తెలుగులో రెండు పెద్ద బేనర్లు నిర్మిం చనున్న రెండు సినిమాల్లో హీరోగా చేయబోతున్నా’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement