శనిదేవుణ్ణి స్తుతించిన ఎస్పీబాలు | SP Balasubramaniam Praise Shani Devudu | Sakshi
Sakshi News home page

శనిదేవుణ్ణి స్తుతించిన ఎస్పీబాలు

Jan 17 2014 4:11 AM | Updated on Sep 2 2017 2:40 AM

శనిదేవుణ్ణి స్తుతించిన ఎస్పీబాలు

శనిదేవుణ్ణి స్తుతించిన ఎస్పీబాలు

శనీశ్వరుని మహిమల నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘శనిదేవుడు’. ‘మహిమలు చూడండి’ అనేది ఉపశీర్షిక. జ్యోతిష పండితులు శివ జొన్నలగడ్డ స్వీయ దర్శకత్వంలో

 శనీశ్వరుని మహిమల నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘శనిదేవుడు’. ‘మహిమలు చూడండి’ అనేది ఉపశీర్షిక. జ్యోతిష పండితులు శివ జొన్నలగడ్డ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే పలు శనీశ్వరాలయాల్లో ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. అనిల్ నండూరి స్వర సారథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన పాటల రికార్డింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో కీలక సన్నివేశంలో వచ్చే పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించడం విశేషం. కులమత రహితంగా అందరూ చూడదగ్గ సినిమా ఇదని శివ జొన్నలగడ్డ చెప్పారు. నరసింహరాజు, తెలంగాణ శకుంతల, రంగనాథ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బీఎస్ కుమార్, నిర్మాణం: సోని ఫిలింస్.
 

Advertisement
 
Advertisement
Advertisement